E-Paper
Advertisement

HVF Notification: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో 1850 జాబ్స్.. మంచివేతనం.. ఇంకా 2 రోజులే!

HVF Notification: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో 1850 జాబ్స్.. మంచివేతనం.. ఇంకా 2 రోజులే!
Advertisement

HVF Notification: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్ అనే చెప్పవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు. అర్హత ఉన్నవారు ఇది గోల్డెన్ ఛాన్స్. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పోస్టులు వెకెన్సీలు, విద్యార్హత, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ (HVF)- 2025 సంవత్సరానికి గాను 1850 జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 18న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1850

హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ (HVF) లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కార్పెంటర్, ఫౌండ్రీ, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ జనరల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్లాక్స్ మిత్/ ఫౌండ్రీ/ ఫౌండ్రీమాన్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్/ పవర్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, ఫిట్టర్ జనరల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్, క్రేన్ ఆపరేటర్ విభాగాల్లో ఐటీఐ పాసై ఉండాలి. లేదా టెన్త్ క్లాస్ పాస్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది.

జీతం: సెలెక్ట్ అయిన వారికి గౌరవప్రదమైన జీతం ఉంటుంది. స్టార్టింగ్ బేసిక్ పే రూ.21,000 ఉంది. (ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి) మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రూ.300 దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వస్సు 35 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 28

దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 18

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.

వెబ్‌సైట్‌: https://oftr.formflix.org

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి గౌరవప్రదమైన జీతం ఉంటుంది. స్టార్టింగ్ బేసిక్ పే రూ.21,000 ఉంది. (ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి) మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1850

దరఖాస్తుకు చివరి తేది: జులై 18

ALSO READ: Railway Jobs: పది పాసైతే చాలు.. రైల్వేలో జాబ్, జస్ట్ అప్లై చేస్తే ఉద్యోగం నీదే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×