Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతలు ఉన్నవారికి ఇది గోల్డెన్ అపార్చునిటీ అని చెప్పవచ్చు. ఆర్ఆర్‌సీ సౌత్ వెస్టర్న్ రైల్వేలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెకట్ అయిన వారికి గౌరవప్రదమైన జీతం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగాలు, వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ప్రక్రియ విధానం, తదితర వాటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆర్‌ఆర్‌సీ సౌత్ వెస్టర్న్ రైల్వే (ఆర్ఆర్‌సీ ఎస్‌డబ్ల్యూఆర్) హుబ్బళ్లి, మైసూరు, బెంగళూరు డివిజన్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 904
ఆర్ఆర్ సీ సౌత్ వెస్టర్న్ రైల్వేలో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషయన్, మెషనిస్ట్, కార్పెంటర్, పెయింటర్ విభాగాల్లో వెకెన్సీలు ఉన్నాయి. అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్
పోస్టులు – వాటి వివరాలు:
అప్రెంటీస్: 904 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసై ఉంటే సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
వయస్సు: ఆగస్ట్ 13వ తేదీ నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్ట్ 13
దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు. జీతం, తదితర వివరాల గురించి వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrchubli.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 904
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 13
ALSO READ: JOBS: ఇంటర్ అర్హతతో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు.. భారీ వేతనం, లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?