BigTV English

AM Ratnam: అందుకే గేమ్ ఛేంజర్ ఫ్లాప్.. ఏ.ఎం.రత్నం కామెంట్స్ వైరల్!

AM Ratnam: అందుకే గేమ్ ఛేంజర్ ఫ్లాప్.. ఏ.ఎం.రత్నం కామెంట్స్ వైరల్!

AM Ratnam: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నిర్మాత ఏ.ఎం.రత్నం(A.M Ratnam) ఒకరు. త్వరలోనే ఈయన నిర్మాణ సారథ్యంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ జూలై 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత ఎ.ఎం. రత్నం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.


గేమ్ ఛేంజర్ అందుకే ఫ్లాప్ అయ్యిందా?

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన హరిహర వీరమల్లు సినిమా గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు రామ్ చరణ్(Ram Charan) హీరోగా, శంకర్(Shankar) దర్శకత్వంలో నటించిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమయ్యి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి గల కారణాలు ఏంటీ అనే ప్రశ్న ఎదురయింది.


తెలుగు సినిమా చేసి తప్పు చేశారా?

ఈ ప్రశ్నకు నిర్మాత ఎ. ఏం రత్నం సమాధానం చెబుతూ..గేమ్ ఛేంజర్ విషయంలో నేను ఒకటే అనుకున్నాను అనవసరంగా శంకర్ తెలుగు సినిమా చేశారేమో అనిపించింది అంటూ ఈయన సమాధానం చెప్పారు. ఎందుకంటే శంకర్ తెలుగు సినిమాల కంటే కూడా ఎక్కువగా తమిళంలో అద్భుతమైన సినిమాలు చేశారు.. అయితే ఇక్కడ గేమ్ ఛేంజర్ విషయంలో ఎక్కువగా కమర్షియల్ గా ఫీల్ అయ్యారా లేదా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అనేది తెలియదు. శంకర్ విషయంలో సక్సెస్, ఫెయిల్యూర్ పక్కన పెడితే ఆయన గ్రేట్ డైరెక్టర్ అంటూ రత్నం తెలిపారు. ఈ విధంగా గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అవడం గురించి ఈయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అంచనాలు పెంచిన ట్రైలర్..

ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా పీరయాడిక్ డ్రామాగా రాబోతుందని తెలుస్తోంది. ఇందులో వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ నటన అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఇటీవల ట్రైలర్ విడుదల కావడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో అభిమానులు కూడా ఎంతో ఉత్సాహం కనబరిస్తున్నారు. మరి వీరమల్లు సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించబోతున్నారో తెలియాల్సి ఉంది.

Also Read: Prakash Raj: ఆ దురద తగ్గించుకో.. ప్రకాష్ రాజ్ పై  డైరెక్టర్ ఫైర్ …సున్నా చుట్టేస్తారంటూ?

Related News

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Prabhas: ప్రభాస్‌కి ఏం తెలీదు… డార్లింగ్‌ను తేజ సజ్జా అలా అన్నాడేంటి ?

Big Stories

×