BHEL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీఈ, బీటెక్, బీఎస్సీ( ఎలక్ట్రికల్, మెకానికల్), ఎంఈ, ఎంటెక్‌లో ఉత్తర్ణత సాధించిన వారికి ఇది సువర్ణ అవకాశమనే చెప్పవచ్చు. బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పించనున్నారు.
బెంగళూరు, భారత్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL Limited) ఖాళీగా ఉన్న మేనేజర్, ఇంజినీర్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 4వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ALSO READ: Jobs in Indian Railways: శుభవార్త.. రైల్వేలో 32,438 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనివారికి మరో అవకాశం..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 20
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సీనియర్ ఇంజినీర్, డిప్యూటీ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు ఖాళీలు వారీగా చూసినట్లైతే..
సీనియర్ ఇంజినీర్-ఈ2: 13 ఉద్యోగాలు
డిప్యూటీ మేనేజర్-ఈ3: 03 ఉద్యోగాలు
మేనేజర్-ఈ4, సీనియర్ మేనేజర్-ఈ5: 04 ఉద్యోగాలు
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 4 (ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్చి 4 లోగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.)
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ (ఎలక్ట్రికల్, మెకానికల్), ఎంఈ, ఎంటెక్‌లో ఉత్తర్ణతతో సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 ఫిబ్రవరి 1 నాటికి సీనీయర్ మేనేజర్‌కు 42 ఏళ్లు, మేనేజర్‌కు 39 ఏళ్లు, మిగతా పోస్టులకు 32 ఏళ్లు నిండి ఉండాలి.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు సీనియర్ ఇంజినీర్‌కు రూ.70,000 – రూ.2,00,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.80,000 – రూ.2,20,000, మేనేజర్‌కు రూ.90,000 – రూ.2,40,000, సీనియర్ మేనేజర్‌కు రూ.1,00,000 – రూ.2,60,000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.400 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://careers.bhel.in/
అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు సీనియర్ ఇంజినీర్‌కు రూ.70,000 – రూ.2,00,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.80,000 – రూ.2,20,000, మేనేజర్‌కు రూ.90,000 – రూ.2,40,000, సీనియర్ మేనేజర్‌కు రూ.1,00,000 – రూ.2,60,000 వేతనం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: Agniveer vayu jobs: అలెర్ట్.. వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలకు మరి కొన్ని గంటలే గడువు
ముఖ్యమైనవి:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 20
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 4