BigTV English

SSMB 29 : ఆదివాసుల నేపథ్యంలో మహేష్ మూవీ… ఈ ట్విస్ట్ అసలు ఊహించి ఉండరు

SSMB 29 : ఆదివాసుల నేపథ్యంలో మహేష్ మూవీ… ఈ ట్విస్ట్ అసలు ఊహించి ఉండరు

SSMB 29… ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి ఎన్ని ఏళ్ల టైం పడుతుందో తెలీదు కానీ… ఈ సినిమా హైప్ మాత్రం ఆకాశాన్ని తాకుతుంది. ఆఫ్రిక ఆడవుల్లో ఈ మూవీ ఉంటుందని విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ, ఆఫ్రీక ఆడవుల్లోకి హీరో ఎలా వెళ్తాడు అనేది మాత్రం రివీల్ చేయలేదు. అయితే, ప్రస్తుతం ఈ మూవీ గురించి ఓ సమాచారం అందుతుంది. హీరో పాత్ర బ్యాగ్రౌండ్ ఏంటి..? హీరో ఆఫ్రిక ఆడవుల్లోకి వెళ్లడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…


జక్కన్న మేకింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కథను బెస్ట్ మూవీగా మలచడంలో రాజమౌళి తర్వాతే ఎవరైన అని చెప్పొచ్చు. ఇప్పుడు SSMB 29పై అవే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ సమాచారం ఆశ్చర్యపరుస్తుంది.

ఆదివాసుల నేపథ్యంలో..?


ఈ SSMB 29 మూవీ ఆదివాసుల నేపథ్యంలో ఉంటుందట. హీరో పాత్ర బ్యాగ్రౌండ్ కూడా ఆదివాసులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని తెలుస్తుంది. రాజమౌళి గత చిత్రం ఆర్ఆర్ఆర్ మూవీలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చేసిన భీమా పాత్ర కూడా ఆదివాసుల నేపథ్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు SSMB 29 మూవీలో కూడా అచ్చం అలాంటి నేపథ్యమే ఉంటుందని సమాచారం. అలాగే సినిమా మొత్తం భక్తి భావంతో ఉంటుందట.

మణి కర్ణిక ఘాట్ నుంచి ఆఫ్రిక ఆడవులు..?

SSMB 29 మూవీ భక్తి భావంతో ఉంటుంది. కాబట్టి సినిమా… కాశీలోని ఎంతో ప్రఖ్యాత ఉన్న మణి కర్ణిక ఘాట్ నుంచి స్టార్ట్ అవుతుందట. చితి మంటల నుంచే ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. అందుకు సంబంధించి ఆల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు గండిపేట్ లో భారీ సెట్ వేశారు. అక్కడ మణి కర్ణిక ఘాట్ సెట్ ను భారీగా వేశారు. ప్రస్తుతం అదే సెట్‌లో షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ మణి కర్ణిక ఘాట్‌కు ఆఫ్రిక ఆడవులకు లింక్ అయ్యేలా స్టోరీని ప్రిపేర్ చేశారట విజయేంద్ర ప్రసాద్. దీన్ని అత్యధునిక టెక్నాలజీ, హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో జక్కన్న తెరకెక్కిస్తున్నాడు.

హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో…

టెక్నాలజీని వాడటంలో రాజమౌళి తర్వాతే ఎవరైన. బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అది అర్థమవుతుంది. తాజాగా ఈ మూవీ కోసం ప్రత్యేకంగా ఫిల్మ్ స్కానర్లు తీసుకువచ్చాడట.  35mm/70mm ఫిల్మ్ స్కానర్లు హైదరాబాద్‌కు రీచ్ అయినట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతునాయి. కాగా ఈ  35mm/70mm ఫిల్మ్ స్కానర్లను హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ వాడుతాడు. ఇప్పుడు అవే… SSMB 29కి జక్కన్న వాడటంతో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

ప్రతి రోజు 2000 మంది..?

SSMB 29 షూటింగ్ కోసం ప్రతి రోజు దాదాపు 2000 మంది కష్టపడుతున్నారట. జూనియర్ ఆర్టిస్టులు, ఆర్టిస్టులు, సపొర్ట్ టీం… ఇలా మొత్తం కలిపి SSMB 29కి రెండు వేల మంది పని చేస్తున్నట్టు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×