BigTV English

Kamareddy Tragedy: మాటలకందని విషాదం.. కాసేపట్లో కూతురు వివాహం..! అంతలోనే గుండెపోటుతో కుప్పకూలిన తండ్రి

Kamareddy Tragedy: మాటలకందని విషాదం.. కాసేపట్లో కూతురు వివాహం..! అంతలోనే గుండెపోటుతో కుప్పకూలిన తండ్రి

Kamareddy Tragedy: ఇంట్లో పెళ్లి జరుగుతందంటే చాలు హడావిడి అంతా ఇంతా కాదు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో మండపం కళకళలాడిపోతుంటుంది. అందరూ కలిసి పెళ్లి పనులు చకచకా జరిపించేస్తుంటారు. ఇంటికి కలర్స్ వేసింది మొదలు.. పెళ్లి రిసెప్షన్ వరకు హంగామా మామూలుగా ఉండదు. ఇక కుమార్తె పెళ్లంటే.. తల్లిదండ్రులకు కంటిమీద కునుకే ఉండదు. ఎంతో ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించినాకే ఆ తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉంటారు. మరికొన్ని క్షణాల్లో కూతురు పెళ్లి..! పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మండపంలోకి చేరుకున్నారు. పూజారి మంత్రాలు మొదలు పెట్టాడు. కన్యాదానం కూడా ప్రారంభమైంది. ఇంతలోనే తీవ్ర విషాదం. కూతురు, అల్లుడి పాదాలు కడుగుతూ.. తండ్రి ఒక్కసారిగా కుప్పకూలాడు. అదే మండపంలో ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.


కూతురు వివాహం జరగుతుండగానే అదే మండపంలో తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు . ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.  కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వరంకు చెందిన కుడిక్యాల బాలచంద్రం హౌసింగ్ బోర్డులో నివసిస్తున్నారు. చిన్న చిన్నకాంట్రాక్టు పనులు నిర్వహిస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక ఆయన భార్య రాజమణి, కూతుర్లు కనక మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మిలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే పెద్ద కూతురు కనక మహాలక్ష్మికి వివాహం కుదిరింది. తన కూతురి పెళ్లిని ఘనంగా నిర్వహించాలనుకున్నాడు.

బీటీఎస్‌ సమీపంలోని ఓ కల్యాణ మండపంలో పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన స్నేహితులు, బంధువులను బాలచంద్రం ఆనందంగా పలకరించారు. అందరూ అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది చిన్నకూతురికి కూడా చేస్తానని చాలామందితో బాలచంద్రం చెబుతూ సంతోషంగా ఉన్నారు. అంతా పెళ్లి మండపానికి చేరుకున్నారు. భాజబజంత్రీలు మొగుతూనే ఉన్నాయి. ఇదే టైంలో మైకులో పంతులు నుంచి పిలుపు. అమ్మాయి తండ్రి బాలచంద్రం ఎక్కడున్నా మండపంలోకి రావాలి అంటూ పంతులు పిలవగానే.. కట్టుకున్న ధోతి పట్టుకుని మండపానికి వెళ్లాడు.


Also Read: భార్యను వేధించాడని.. జ్యోతిష్యుడిని చాకుతో పొడిచి.. పెట్రోల్ పోసి

కన్యాదానం చేసే టైం వచ్చింది. పంతులు మంత్రాలు చదువుతూ అల్లుడి కాళ్లు తాంబాలంలో పెట్టి కడగమని చెప్పగా.. తన భార్య నీళ్లు పోస్తుంటే, బాలచంద్రం అల్లుని కాళ్లు కడుకుతున్నాడు. కరెక్ట్‌గా ఇదే టైంలో అల్లుని కాళ్లు కడుగుతూనే బాలచంద్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పెళ్లి పందిరి నుంచి హుటాహుటినా కామారెడ్డిని ఓ హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే బాలచంద్రం చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో కూతురు పెళ్లిరోజే తండ్రి చనిపోవడం కుటుంబం తీరని విషాదాన్ని నింపింది.

 

Related News

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్.. విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Big Stories

×