OFMK Recruitment: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులు ఇది సువర్ణవకాశం. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ (OFMK) లో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి గౌరవ ప్రదమైన జీతం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్(OFMK) కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు అప్లై చేసుకోండి. మే 14వ తేదీ వరకు అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
Also Read: Mega DSC Application: మెగా డీఎస్సీకి ఇలా సింపుల్‌గా అప్లై చేసుకోండి..
వెకెన్సీల సంఖ్య: 20
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లో వివిధ రకాల పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. జూనియర్ టెక్నీషియన్ (ఎగ్జామినర్ ఇంజినీరింగ్), జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ టెక్నీషియన్ (ఎగ్జామినర్ ఇంజినీరింగ్) : 10 పోస్టులు
జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్) : 10 పోస్టులు
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 14
విద్యార్హత: ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత విభాగంగలో ఎన్ఏసీ/ ఎన్‌టీసీ (ఫిట్టర్) లో పాసైన వారు దరఖాస్తు చేసుకోండి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా చూస్తారు.
వయస్సు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉండును. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉండును. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉండును. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉండును.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ట్రేడ్ టెస్ట్ అధారంగా సెలెక్ట్ చేస్తారు.
వేతనం: సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.21 వేల జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉండును.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా: యూనిట్ ఆఫ్ ఎవీఎన్‌ఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి, హైదరాబాద్- 502205
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://avnl.co.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.21వేల జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి. జాబ్ కొట్టండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
వెకెన్సీల సంఖ్య: 20
అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 14