BigTV English

Ashu Reddy: ఆర్జీవీ బ్యూటీకి బ్రెయిన్ సర్జరీ… చూస్తే కన్నీళ్లు ఆగవు

Ashu Reddy: ఆర్జీవీ బ్యూటీకి బ్రెయిన్ సర్జరీ… చూస్తే కన్నీళ్లు ఆగవు

Ashu Reddy: టీవీ యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెర్ గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు అషు రెడ్డి. 2018లో వచ్చిన చల్ మోహన్ రంగా సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, ప్రజాధరణ పొందింది. ఈమె బిగ్ బాస్ బజ్ లో యాంకర్ గా వ్యవహరించారు. అషు గత కొంతకాలంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, హాస్పటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది చూసిన వారంతా అసలు ఆమెకు ఏమైందని ఆందోళన చెందుతున్నారు. అసలు ఆమె హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయిందో ఎలా ట్రీట్మెంట్ తీసుకుని బయట పడిందో చూపిస్తూ.. ఒక వీడియోని పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..


చూస్తే కన్నీళ్లు ఆగవు…

తెలుగు ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అషు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. తాజాగా సోషల్ మీడియలో పెట్టిన పోస్ట్ చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆమెకి బ్రెయిన్ కి సంబంధించిన ఆపరేషన్ జరిగింది. ఆమెకు డాక్టర్స్ బ్రెయిన్ కు ట్రీట్మెంట్ చేసారు. తనకి బ్రెయిన్ సర్జరీ జరిగిందని.. బ్రెయిన్ సర్జరీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు తను ఎంత బాధ అనుభవించిందో.. ఎలా ట్రీట్మెంట్ చేశారు.. ఎంతలా బాధ పడిందో.. ఎలా తాను రికవరీ అయ్యిందో చూపిస్తూ వీడియో పెట్టారు. ఆ వీడియో చూస్తుంటే అషు ఇంత బాధని అనుభవించిందా అనిపిస్తుంది.. ఇప్పుడు ఈ వీడియో అభిమానులలో ఆందోళనరేకిస్తుంది. ఎంతో యాక్టివ్ గా ఉండే అషు ఇలా బాధపడడం చూసి, అభిమానులు తొందరగా కోలుకొని రావాలని పోస్టులు పెడుతున్నారు. ఇది జీవితం చాలా చిన్నది ఎంతోమంది, నా చుట్టూ ఉండి నేను కోలుకునేలా, ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు అంటూ అషు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. పలువురు సెలెబ్రిటీలు అషు గెట్ విల్ సూన్, డేర్ గర్ల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


వివాదాలు దాటుకొని ..

అషు రెడ్డి త్రిముఖ, స్పార్క్ ఫోకస్ వంటి సినిమాలలో నటించారు. బ్యూటీ కంటెంట్ తో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. ఈమె పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఆయన పేరుని కూడా ఆమె తన వీపుపై టాటూ వేయించుకున్నారు. ఈమెని జూనియర్ సమంత గా అభిమానులు పిలుచుకుంటారు. ఈమెపై ఎన్నో రకాల వివాదాలు వచ్చాయి. ఎక్కువగా విదేశాల్లో కనిపిస్తుంది అని, పెద్ద డైరెక్టర్ తో సంబంధం ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. అసలు అషు రెడ్డికి ఆర్జీవికి ఉన్న సంబంధం పైన ఎన్నో వార్తలు వచ్చాయి. ఆర్జీవి ఒకసారి అషు రెడ్డి తో ఇంటర్వ్యూ చేయడం, అందులో అషు కాళ్ళు ఆర్జీవి తాకడం, హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత ఆయనతో కలిసి ఎన్నో పార్టీలకు ఆమె హాజరవడం ఎన్నో వివాదాలకు దారితీసింది. ఏది ఏమైనా ఈమె ఆరోగ్య పరిస్థితి గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకొని ఎప్పటిలాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

?utm_source=ig_web_copy_link

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×