BigTV English

Indians Return From Iran: మన దేశ గొప్పతనం తెలిసింది.. కన్నీళ్లతో.. దండం పెడుతూ..!

Indians Return From Iran: మన దేశ గొప్పతనం తెలిసింది.. కన్నీళ్లతో.. దండం పెడుతూ..!

Indians Return From Iran: పశ్చిమాశియాలో ఘర్షణ వేల ఇరాన్‌లో చిక్కుకున్న.. మరొక 290 మందితో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతీయలు దాదాపు 1,117 మందిని కాపాడారు అధికారులు. భారత గడ్డపై అడుగుపెట్టగానే అంతగా ఎమోషనల్ అయ్యారు. హిందుస్తాన్ జిందాబాద్ అంటూ ఒక్కసారిగా నినాదాలు చేశారు. సారే జహాసే అచ్చా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇండియా గొప్పతనం తెలిసిందంటూ వెక్కి వెక్కి ఏడ్చారు పలువురు విద్యార్ధులు.


యుద్దం కారణంగా ఇరాన్‌లో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటున్నారు భారతీయులు. మన దేశం వచ్చిన వాళల్లో ఎక్కువమంది కశ్మీరీలే ఉన్నారు. ఎంబీబీఎస్ కోసం ఇరాన్ వెళ్లారు పలువురు విద్యార్ధినీ విద్యార్ధులు. ఈ నేపథ్యంలో ఇక యుద్ధం ప్రారంభం కాగానే తమ వాళ్లను కాపాడమంటూ.. కశ్మీర్‌లో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో భారత్ ఇరాన్ రాయభారీ కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపింది.

ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఒక ఎత్తు.. అగ్రరాజ్యం చేసిన ఎటాక్స్ మరో ఎత్తు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం. వార్‌సీన్‌లోకి తొలిసారి అగ్రరాజ్యం ఎంట్రీ ఇచ్చింది. ఇది వార్‌ను వన్‌సైడ్ చేస్తుందా? క్లైమాక్స్‌కు చేరుస్తుందా? మరింత ఉద్రిక్తతలు రాజేస్తుందా? ఇనాళ్లు మౌనముద్రలో ఉన్న ముస్లిం దేశాలు ఇప్పుడేం చేస్తాయి? ఇరాన్‌కు అండగా నిలుస్తాయా? మౌనంగానే ఉంటాయా? ఇదే ఇప్పుడు ఉత్కంఠ రాజేస్తోంది.


ఇరాన్‌పై దాడి చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇరాన్‌లోని మూడు అణు స్థావరాలపై ఎటాక్స్ చేసినట్లు తెలిపారు. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. దాడి చేసిన యుద్ధ విమానాలు తిరిగి సురక్షితంగా వచ్చాయని అమెరికా ప్రకటించింది. ప్రపంచంలో మరే దేశ సైన్యం కూడా ఇలా చేయగలిగేది కాదని.. ఇప్పుడిది శాంతికి సమయమని ట్రంప్ పోస్ట్ చేశారు.

ఇరాన్‌లోని భూగర్భ అణు స్థావరాలను ధ్వంసం చేయగల సత్తా ఇజ్రాయెల్‌కు లేదని ట్రంప్ అన్నారు. ఆ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోడానికి రెండు వారాల టైం పడుతుందని చెప్పుకొచ్చారు. అంతలోనే.. ఎటాక్స్‌కు దిగారు.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎంటరైన అమెరికా.. మరిన్ని దాడులు చేస్తుందా? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తెలుసంటూ ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. ఆయన్ను ఖతం చేస్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి అదనపు దాడులు చేసే ఉద్దేశం అమెరికాకు లేనట్టు చెప్తున్నారు. ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.

Also Read: బాంబులేస్తే నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేస్తారా? ట్రంప్ లాజిక్ ఏంటి?

అమెరికా B-2 స్పిరిట్‌ బాంబర్లతో ఇరాన్‌పై విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్‌, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై భారీ దాడులే చేసింది. ఇరాన్‌ గగనతలం బయట నుంచే ఎటాక్స్ చేసినట్టు ట్రంప్ చెప్తున్నారు. అణు స్థావరాలపై విజయవంతంగా దాడులు చేసిన తర్వాత.. తమ విమానాలు సురక్షితంగా వెనక్కు వచ్చాయని తెలిపారు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యంకాదంటూ తన దేశ సైన్యంపై ప్రశంసలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ ప్రకారం ఫోర్డో నాశనమైందని కూడా చెప్పారాయన. ఇజ్రాయెల్ వైమానిక దళంతో కలిసి దాడి చేసినట్లు స్పష్టంచేశారు. ఈ విషయంలో అమెరికన్ దళాలకు ఇజ్రాయెల్ పూర్తి సహకారం అందించింది.

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×