SSC Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బిగ్ గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఫేస్ 13- నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ కు సంబంధించిన వెకెన్సీలు, అర్హతలు, వయస్సు, దరఖాస్తు తేదీలు, ఉద్యోగ ఎంపిక ప్రక్రియ, జీతం గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం.
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఫేస్-13 లో 2402 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2402
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో ఫేస్ -13 నుంచి పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
విద్యార్హత: టెన్త్, ఇంటర్, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 2
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 23
దరఖాస్తు ఫీజుకు లాస్ట్ డేట్: 2025 జూన్ 24
అప్లికేషన్ సవరించుకునేందుకు: 2025 జూన్ 28 నుంచి 2025 జూన్ 30
ఎగ్జామ్ డేట్: 2025 జూలై 24 నుంచి 2025 ఆగస్టు 4 వరకు
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్‌సైట్: https://ssc.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఉంటుంది. ఇలా మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: CDAC Recruitment: సీడ్యాక్‌లో టెక్నీషియన్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు.. జాబ్ మీదే
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 2402
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 23