HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గతంలో కమిట్ అయిన సినిమాలలో హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రం ఒకటి. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో ఏ ఎమ్ రత్నం నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేది. ఇక ఈ సినిమా మొఘల్ సామ్రాజ్యకాలం నాటి కథా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ చిత్రం మరో డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyothi Krishna)చేతిలోకి వెళ్ళింది.
దర్శకుడిగా జ్యోతి కృష్ణ…
ఇక ఈ సినిమాకు మిగిలిన భాగం జ్యోతి కృష్ణ దర్శకత్వంలోనే తెరకెక్కి జూన్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా విడుదలకు తక్కువ సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిర్మాత ఎ.యం రత్నం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ఈయన ఈ సినిమా నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడం ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకుడిగా వ్యవహరించడం గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
షూటింగ్ ఆలస్యం కావటం వల్లే….
ఈ క్రమంలోనే యాంకర్ నిర్మాతను ప్రశ్నిస్తూ… సాధారణంగా ఒక సినిమా నుంచి డైరెక్టర్లను తప్పించడం అంటే ఎంతో రిస్క్ తో కూడిన అంశం. నిర్మాతగా మీకు డైరెక్టర్ క్రిష్ ను తప్పించి జ్యోతి కృష్ణను తీసుకోవడం రిస్క్ అనిపించలేదా? అంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు నిర్మాత సమాధానం చెబుతూ… దర్శకుడు మారడం అనేది యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప ,ఆయన చేయకూడదని, మా అబ్బాయిని తీసుకురావాలని మేమైతే ఎవరు అనుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కోసం దర్శకుడు క్రిష్ ఎక్కువ కాలం మాతోపాటు ట్రావెల్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పరంగా, మొదటిసారి, రెండోసారి కరోనా రావడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది. దర్శకుడు క్రిష్ ఇతర సినిమాలకు కమిట్ అవటం వల్లే తప్పుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాని అతడు కాపాడినట్టే అవుతుంది అంటూ మాట్లాడటంతో వెంటనే యాంకర్ క్రిష్ తప్పుకోవడమా? అంటూ ప్రశ్నించింది.
"#JyothiKrishna ఎంటర్ అవడం, ఒక విధంగా ఈ సినిమాను కాపాడినట్టే అవుతుంది."
– AM Rathnam talks about why director #KrishJagarlamudi left the project. pic.twitter.com/NgdtzmpHZA
— Whynot Cinemas (@whynotcinemass_) June 2, 2025
యాంకర్ ప్రశ్నకు ఒక్కసారిగా షాక్ అయిన నిర్మాత క్రిష్ తప్పుకోవడం కాదండి.. మా జ్యోతి ఈ సినిమాలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఈ సినిమాని ఒక విధంగా కాపాడినట్టు అయిందని తెలిపారు. క్రిష్ తప్పుకోవడం వల్ల సినిమా సేఫ్ అని చెప్పడం చాలా వరకు తప్పు. నిజం చెప్పాలంటే ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది అంటే అందుకు కారణం క్రిష్ అని తెలిపారు. అలాగే క్రిష్ తో తనకున్న అనుబంధం గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవ్వడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.