E-Paper
Advertisement

NHAI Recruitment: నేషనల్ హైవేస్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.5లక్షల జీతం.. ఇలా అవకాశం మళ్లీ రాదు భయ్యా..

NHAI Recruitment: నేషనల్ హైవేస్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.5లక్షల జీతం.. ఇలా అవకాశం మళ్లీ రాదు భయ్యా..
Advertisement

NHAI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్. సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ లేదా పీజీ, పీహెచ్ డీ పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా – డీపీఆర్‌సెల్ ఆఫ్ ఎన్‌హెచ్ఏఐ (NHAI) లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

ఢిల్లీ, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా – డీపీఆర్‌సెల్ ఆఫ్ ఎన్‌హెచ్ఏఐ (NHAI)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

Advertisement

వెకెన్సీల సంఖ్య: 26

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు రకాల వెకెన్సీలు ఉన్నాయి. ప్రిన్సిపల్ డీపీఆర్ ఎక్స్ పర్ట్, డొమైన్ ఎక్స్ పర్ట్ – సీనియర్ హైవే ఎక్స్ పర్ట్, రోడ్ సెఫ్టీ ఎక్స్ పర్ట్, ట్రాఫిక్ ఎక్స్ పర్ట్, ఎన్పిరాన్మెంట్ / ఫారెస్ట్ స్పెషలిస్ట్, ల్యాండ్ ఆక్వీజిషన్ ఎక్స్ పర్ట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

పోస్టులు – ఖాళీలు

ప్రిన్సిపల్ డీపీఆర్ ఎక్స్ పర్ట్ : 4 పోస్టులు

డొమైన్ ఎక్స్ పర్ట్ – సీనియర్ హైవే ఎక్స్ పర్ట్: 4 పోస్టులు

రోడ్ సేఫ్టీ ఎక్స్ పర్ట్ : 4 పోస్టులు

ట్రాఫిక్ ఎక్స్ పర్ట్ : 5 పోస్టులు

ఎన్ఫిరాన్మెంట్ / ఫారెస్ట్ స్పెషలిస్ట్ : 5 పోస్టులు

ల్యాండ్ ఆక్వీజిషన్ ఎక్స్ పర్ట్ : 4 పోస్టులు

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 30

విద్యార్హత: సివిల్ విభాగంలో ఇంజినీరింగ్, పీజీ, పీహెచ్ డీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 65 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. అభ్యర్థులకు నెలకు రూ.3,50,000 నుంచి రూ.5లక్షల వరకు వేతనం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://nhai.gov.in/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం వెకెన్సీల సంఖ్య: 26

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30

Also Read: CSIR-CRRI Recruitment: గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.81,100 జీతం..

Also Read: Mega DSC Application: మెగా డీఎస్సీకి ఇలా సింపుల్‌గా అప్లై చేసుకోండి..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×