BigTV English

Shanmukh: మ్యారేజ్ పై అప్డేట్ ఇచ్చిన షణ్ముఖ్… పాపం దీప్తి

Shanmukh: మ్యారేజ్ పై అప్డేట్ ఇచ్చిన షణ్ముఖ్… పాపం దీప్తి

Shanmukh: షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన వీరి గురించి తెలియని వారు ఉండరు. షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబర్ గా వెబ్ సిరీస్ లలో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్బాస్ తెలుగు 5లో రన్నర్ అప్ గా, నిలిచారు. షణ్ముఖ్ యూట్యూబ్లో తన డాన్స్ పెర్ఫార్మెన్స్ ద్వారా వెబ్ సిరీస్ లో నటించే అవకాశాన్ని సంపాదించారు. ది సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లో షణ్ముఖ్ రన్నర్ అప్ గా నిలిచినా షోలో కంటెస్టెంట్ సిరి తో క్లోజ్ గా ఉండడం అప్పట్లో వివాదానికి కారణమైంది. షణ్ముఖ్, దీప్తి ఇద్దరూ ఒకరి కోసం మరొకరు పుట్టారు అన్నంతగా సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు షణ్ముఖ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ ఏంటి అన్నది తెలుసుకుందాం ..


పాపం దీప్తి ..

షణ్ముఖ్ దీప్తి ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి దాకా వచ్చి విడిపోయారు. కొన్ని రోజుల తర్వాత షణ్ముఖ్ సిరి తో బిగ్ బాస్ లో క్లోజ్ గా ఉంటున్న దుమారంపై అతనిని దూరం పెట్టింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి గురించి ఎక్కడా మాట్లాడలేదు. షణ్ముఖ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. దీప్తి ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్లో స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో షణ్ముఖ్ తాజాగా పెట్టిన ఒక పోస్ట్ వీరి ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది. షణ్ముఖ్ పెళ్లి గురించి అడిగినా సందర్భంలో.. పెళ్లి చేసుకునే టైం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, ఆ టైం వచ్చినప్పుడు అది కచ్చితంగా జరుగుతుంది అని షణ్ముఖ్ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో అభిమానులు అడిగే ప్రశ్నకి సమాధానంగా వీడియోని షేర్ చేశారు. ఇది చూసిన షణ్ముఖ్ , దీప్తి ఫ్యాన్స్ ఇప్పుడు పాపం దీప్తి అంటూ, కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా వీరిద్దరూ కలిసి ఉంటే బాగుంటుందని కోరుకునే అభిమానులే ఎక్కువ. ఇప్పుడు వీరు ఎవరికివారు పెళ్లి గురించి అనౌన్స్మెంట్ చేస్తే అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. షణ్ముఖ్ పెళ్లి ప్రకటనతో దీప్తి గురించే అందరూ మాట్లాడుకోవడం విశేషం.


విడిపోవడానికి కారణం అదే ..

2021 డిసెంబర్ 31న దీప్తి తన ఇంస్టాగ్రామ్ లో షణ్ముఖ్ తో విడిపోతున్నట్లుగా ప్రకటించింది. ఐదు సంవత్సరాల బంధం తమ జీవితంలో ఎంతో సంతోషాన్ని, ప్రేమను నింపిందని పరస్పర నిర్ణయంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. బిగ్ బాస్ షోలో షణ్ముఖతో సిరి సన్నిహితంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం అని అభిమానులు ఊహించుకున్నారు. కానీ దీనిపై షణ్ముఖ్ క్లారిటీ ఇస్తూ మేమిద్దరం స్నేహితులమే అని మా మధ్య ఎటువంటి బంధము లేదని తెలిపాడు. కానీ దీప్తితో తను విడిపోవడానికి కారణం మాత్రం బయటకు తెలపలేదు. దీప్తి తన ఇంస్టాగ్రామ్ లైవ్ సెషన్లో తను విడిపోవడం గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఎమోషనల్ అయిన సన్నివేశాలు ఉన్నాయి. ప్రస్తుతం తన కెరియర్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. దీప్తి సోషల్ మీడియాలో రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ అనే పాటను రీ క్రియేట్ చేసిన వీడియో ద్వారా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఆమె చేసిన ప్రతి సాంగ్ లక్షల్లో వ్యూస్ రావడం మొదలు పెట్టాయి. 2018లో కిర్రాక్ పార్టీ సినిమాతో తెలుగు తెర పైన కూడా నటిగా అడుగుపెట్టింది దీప్తి. ఆ తర్వాత ఎన్నో సోలో సాంగ్స్ కి, ప్రైవేటు ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

Samantha:సడన్ గా తిరుమలలో ప్రత్యక్షమైన సమంత… ఎందుకోసం అంటే..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×