E-Paper
Advertisement

టెన్త్, ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. మంచి శాలరీ, ఇంకెందుకు ఆలస్యం

టెన్త్, ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. మంచి శాలరీ, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. ఫేజ్-XIV/2026 సెలక్షన్ పోస్టుల నోటిఫికేషన్‌లో కీలక మార్పులు చేసింది. మొదట ప్రకటించిన 3003 ఖాళీల సంఖ్య తాజా సవరణల తర్వాత 2,919కి తగ్గింది. ఏప్రిల్ 20న విడుదలైన ఈ నోటిఫికేషన్ ప్రకారం కొన్ని విభాగాల్లో కొత్త పోస్టులు చేరగా మరికొన్నింటిని రద్దు చేశారు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2919

Advertisement

నోట్: అప్లికేషన్ కు ఇంకా 4 రోజుల సమయమే…

ముఖ్యంగా డీఆర్‌డీఓ విభాగంలో 104 కొత్త ఖాళీలు జతయ్యాయి. ఇందులో ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ‘ఏ’, ఫైర్ ఫైటర్, సెక్యూరిటీ అసిస్టెంట్ ‘ఏ’, వెహికిల్ ఆపరేటర్ ‘ఏ’ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. మరోవైపు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన 188 పోస్టులను నోటిఫికేషన్ నుంచి తొలగించారు. డ్రిల్లింగ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి పోస్టులు రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి.

Advertisement

ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మెట్రిక్యులేషన్ నుండి డిగ్రీ వరకు వివిధ స్థాయిల పోస్టులను భర్తీ చేస్తారు.

టెన్త్ అర్హతతో.. 

పదో తరగతి అర్హత ఉన్న వారికి ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్, స్టాఫ్ కార్ డ్రైవర్, ఫీల్డ్ వర్కర్, కుక్, మెడికల్ అటెండెంట్, క్యాంటీన్ అటెండెంట్ వంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

జీతం: వీరికి లెవల్-1 వేతనం కింద నెలకు సుమారు రూ.35,000 వరకు జీతం లభిస్తుంది.

ఇంటర్ అర్హతతో.. 

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు కాపీహోల్డర్, ఫీల్డ్ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్, స్టోర్ కీపర్, హెల్త్ వర్కర్, క్లర్క్ వంటి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి లెవల్-2 వేతన శ్రేణి వర్తిస్తుంది.

జీతం: నెలకు సుమారు రూ.40,000 వరకు వేతనం అందుకునే అవకాశం ఉంటుంది. అలాగే డిప్లొమా అర్హత ఉన్న వారికి వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు ఉన్నాయి. వీరు లెవల్-6 వేతనంతో నెలకు సుమారు రూ.60,000 జీతం పొందవచ్చు.

డిగ్రీ అర్హతతో.. 

డిగ్రీ అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారి కోసం గ్రేడ్-బి డేటా ఎంట్రీ ఆపరేటర్, సబ్ ఇన్‌స్పెక్టర్, సీనియర్ ట్రాన్స్‌లేటర్, నర్సింగ్ ఆఫీసర్, అకౌంటెంట్ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి.

జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు పోస్టును బట్టి నెలకు రూ.50,000 నుండి రూ.80,000 వరకు వేతనం పొందుతారు. అభ్యర్థులు తమకు అర్హత ఉన్న ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రతి పోస్టుకు విడిగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది:  అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు మే 4 లోపు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు చెల్లించడానికి మే 5 చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తులో ఏవైనా తప్పులుంటే సవరించుకోవడానికి మే 11 నుండి 13 వరకు అవకాశం కల్పించారు.

ఎగ్జామ్: రాత పరీక్షలు జూన్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.gov.in/

ALSO READ: 827 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. మంచి వేతనం, ఇంకా 4 రోజులే మాత్రమే..!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×