Indian Military Academy Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బీటెక్ లేదా బీఈ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ)- 2026 జనవరిలో స్టార్ట్ అయ్యే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు మంచి జీతం ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం మనం క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
డెహ్రాడూన్, ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ) 2026 జనవరిలో ప్రారంభమయ్యే 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 నుంచి మే 29వ తేదీ వరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం వెకెన్సీ సీట్ల సంఖ్య: 30
ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ)లో పలు రకాల పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. అలాగే పలు విభాగాల్లో వెకెన్సీలు ఉన్నాయి. సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇతర విభాగాల్లో వెకెన్సీ లు ఉన్నాయి.
కోర్సు పేరు: టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్- 142
వివిధ విభాగాల్లో సీట్ల వివరాలు:
సివిల్: 08
మెకానికల్: 06
సీఎస్(కంప్యూటర్ సైన్స్): 06
ఎక్ట్రికల్: 02
ఎలక్ట్రానిక్స్: 06 ఇతర విభాగాలు: 02
విద్యార్హత: కోర్సు సంబంధిత విభాగంలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సీఎస్, ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో బీటెక్/ బీఈ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 27 ఏళ్ల వయస్సు మద్య ఉండాలి. ( 1999 జనవరి 2 నుంచి 2006 జనవరి 1 తేదీల మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి.)
స్టైఫండ్: కోర్సుకు అర్హత సాధించిన వారికి రూ.56,100 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 30
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 20
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.joinindianarmy.nic.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సుకు అర్హత సాధించిన వారికి రూ.56,100 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి. అర్హత సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
కోర్సులో మొత్తం ప్రవేశాల సంఖ్య: 30
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 29