MED Notification: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ (బీఎస్సీ), పీజీ డిప్లొమా, డీఎంఎల్‌టీ, ఎంఎల్‌టీ లో పాసైన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. కడప జిల్లా నిరుద్యోగులకు అయితే ఇది మంచి అవకాశం. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ (kadapa med) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నవారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
కడప, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ (kadapa med) కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు అప్లై చేసుకోండి. మే 20న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 69
మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో అనస్థీషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
అనస్థీషియా టెక్నీషియన్: 04 ఉద్యోగాలు
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్: 06 ఉద్యోగాలు
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2: 09 ఉద్యోగాలు
జూనియర్ అసిస్టెంట్: 02 ఉద్యోగాలు
డేటా ఎంట్రీ ఆపరేటర్స్: 02 ఉద్యోగాలు
ఎలక్ట్రీషియన్: 01 ఉద్యోగం
జనరల్ డ్యూటీ అటెండెంట్: 44 ఉద్యోగాలు
ప్లంబర్: 01 ఉద్యోగం
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ(బీఎస్సీ), ఇంటర్, ఐటీఐ, పదో తరగతి, పీజీ డిప్లొమా, డీఎంఎల్‌టీ, ఎంఎల్‌టీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 42 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. నెలకు అనస్థీషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2కు రూ.32,670, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్‌కు రూ.18,500, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్‌కు రూ.15,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 10
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 20
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.400 దరఖాస్తు ఫీజు ఉంటుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300 దరఖాస్తు ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
చిరునామా: దరఖాస్తు ఫారంను అడిషనల్ డీఎంఈ/ప్రిన్సిపల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, పుట్లంపల్లి, కడప, వైఎస్‌ఆర్ కడప జిల్లా అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://kadapa.ap.gov.in
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్త ఉద్యోగ ఖాళీల సంఖ్య: 69
దరఖాస్తుకు చివరి తేది: మే 20
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా..