Vijayawada – Visakhapatnam Flight Service: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విశాఖపట్నం- విజయవాడ విమాన సేవలు త్వరలో మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర విమానయానశాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక విషయాన్ని వెల్లడించాడు. జూన్ 1 నుంచి ఈ విమానా సేవలు అందుబాటులోకి రాబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. విమాన సర్వీసులు వివరాలను తెలిపారు.
ఇంతకీ రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే?
విశాఖపట్నం- విజయవాడ నడుమ ఉదయపు విమాన సేవలు ప్రారంభం అవుతాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విమాన సర్వీసులు ఇరు నగరాలతో పాటు ఏపీ రవాణా కనెక్టివిటీలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రాష్ట్ర రాజధాని విజయవాడను, ఆర్థిక కేంద్రం విశాఖపట్నం మధ్య మెరుగైన రాకపోకలకు ఉపయోగపడుతాయన్నారు. తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రయాణీకులకు చక్కటి సౌకర్యాన్ని కలిగించనున్నట్లు చెప్పారు.
Read Also: 4.5 గంటల్లో రైల్వే బ్రిడ్జి నిర్మాణం, ఇండియన్ రైల్వే సరికొత్త రికార్డు!
విమాన రాకపోకలు సంబంధించిన షెడ్యూల్
సవరించి షెడ్యూల్ ప్రకారం.. విమానాల రాకపోకలు ఎలా ఉంటాయో రామ్మోహన్ నాయుడు వివరించారు. “ఇండిగో విమానం ఉదయం 7.15 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరుతుంది. ఉదయం 8.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే విమానం ఉదయం 8.45 గంటలకు విశాఖ నుంచి బయల్దేరుతుంది. ఉదయం 9.50 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యం అని చెప్పిన రామ్మోహన్ నాయుడు.. ప్రయాణీకుల సౌలభ్యం కోసం, రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా ఈ కీలకమైన విమాన సేవ మళ్లీ ప్రారంభమవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. “విజయవాడ, విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సర్వీస్ జూన్ 1 నుండి తిరిగి ప్రారంభమవుతుందని మీతో చెప్పేందుకు సంతోషంగా ఉంది. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్ రవాణా అనుసంధానంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర రాజధాని విజయవాడను, ఆర్థిక కేంద్రమైన విశాఖపట్నంను ఈ విమాన సర్వీసు కలుపుతుంది. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడం మా ప్రధాన లక్ష్యం. ప్రయాణీకుల సౌలభ్యం కోసం, రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా ఈ కీలకమైన విమాన సేవ మళ్లీ ప్రారంభమవడం ఆనందంగా ఉంది” అని రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
Read Also: ఆహా ఎంత అద్భుతమో.. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాలు ఇవే!