E-Paper
Advertisement

CDAC : సీడ్యాక్ నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ అర్హతలు ఉంటే చాలు.. ఉద్యోగం మీదే

CDAC : సీడ్యాక్ నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ అర్హతలు ఉంటే చాలు.. ఉద్యోగం మీదే
Advertisement

CDAC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (CDAC).. ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్‌డీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

బెంగళూరు, సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) లో 311 ప్రాజెక్ట్ అసోసియేట్, ఇంజినీర్, టెక్నీషియన్ తదితర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 20న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 311

సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ లో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రాజెక్ట్ అసోసియేట్, ఇంజినీర్, టెక్నీషియన్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, ఎంఫిల్ పీహెచ్‌డీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 35 నుంచి 56 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

ఆన్ లైన్ దరఖాస్తుకు లాస్ట్ డేట్: 2025 జూన్ 20

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితర ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జాబ్ లోకేషన్: హైదరాబాద్, చెన్నై, ముంబై, కొచ్చి, గోవా, భోపాల్, ఢిల్లీ నగరాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్ ఇదే: https://careers.cdac.in

అర్హత ఉండి ఆసక్తి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: RRB Jobs: గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 6180 ఉద్యోగాలు.. మంచివేతనం, పూర్తి వివరాలివే

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 311

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 20

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×