Niharika – Tom Cruise: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు సొంతం చేసుకున్న నిహారిక ఎన్. ఎమ్ (Niharika NM) తాజాగా ఇంటర్నేషనల్ యాక్టర్ టామ్ క్రూజ్ (Tom Cruise) తో చనువుగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ తో నిహారిక చనువుగా దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. UK లో మిషన్ ఇంపాజిబుల్ : ది ఫైనల్ రెకనింగ్ ప్రీమియర్ జరిగింది. దీనికి వరల్డ్ వైడ్ గా ఉన్న టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని చిత్ర బృందం ఆహ్వానించింది. అందులో భాగంగానే ఇన్విటేషన్ అందుకున్న నిహారిక కూడా టామ్ క్రూజ్ తో సందడి చేసింది. ముఖ్యంగా నిహారిక వస్తుంటే ఆమె చేయి పట్టుకొని జాగ్రత్తగా ఆమెను పైకి తీసుకెళ్లారు టామ్ క్రూజ్. ఆయనతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్స్ కూడా ” నిహారిక అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ బ్రాండ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు..
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నిహారిక ఎన్.ఎమ్.భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్ అయిన ఈమె సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్, కామెడీ క్వీన్ గా పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 6 మిలియన్ సబ్స్క్రైబర్లు కలిగి ఉన్న ఈమె.. యూట్యూబ్ ఆధ్వర్యంలో జరిగిన క్రియేటర్స్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో ఇండియా నుంచి వరుసగా రెండోసారి రిప్రజెంట్ చేసింది. నిహారిక కొన్ని ముఖ్యమైన సామాజిక అంశాలపై కూడా అవేర్నెస్ తీసుకొస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఈమె చదువుకున్న యూఎస్ కాలిఫోర్నియా చామ్ మాన్ యూనివర్సిటీలో కెరియర్ లో తాను ఎదిగిన విధానంపై కేసు స్టడీ చేస్తూ ఉండడం గమనార్హం. ఇక టాలీవుడ్ లో కూడా నిహారిక ఎన్.ఎం కి మంచి ఫ్యూచర్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ALSO READ: Thug Life Trailer: కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ మూవీ ట్రైలర్ రిలీజ్.. ఫుల్ మీల్స్ అంటున్న ఫ్యాన్స్..!
నిహారిక సినిమాలు..
గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన పెరుసు సినిమాలో నటిగా కీలక పాత్ర పోషించిన ఈమె.. ఇప్పుడు మరో సినిమాలో అవకాశం అందుకున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో కూడా నిహారికకి అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది అనడంలో సందేహం లేదు.
?utm_source=ig_web_copy_link