Telangana Job Notifications: రేవంత్ సర్కార్ కొలువుల జాతర మొదలెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్రూప్-1,2,3 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్స్ పరీక్షల రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అయితే.. మళ్లీ కొత్తగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎలాగూ కీలకమైన ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం, నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి.
⦿ 20వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్
2024-25 ఏడాదికి పోస్టుల భర్తీకి జారీ చేసిన జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా ప్రభుత్వం గుర్తించి, పంపించిన ప్రతిపాదనల్లో మార్పుచేర్పులు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం.. ఉద్యోగ ఖాళీల వివరాలను తెప్పించుకుని.. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే త్వరలోనే 20వేలకు పైగా పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
⦿ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పు
రేవంత్ సర్కార్.. ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబందించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిిందే. ఈ క్రమంలోనే 2024-25 ఏడాదికి సంబంధించి జాబ్ క్యాలెండర్ ను జారీ చేసింది. దాని ప్రకారమే.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను గుర్తించి టీజీపీఎస్సీ, ఇతర నియామకాల సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి. జాబ్ క్యాలెండర్ అమలు చేసే క్రమంలోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎస్సీల్లోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయలేమని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
⦿ ఖాళీల వివరాలను సవరించి పంపండి..
దీంతో గత సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకారం విడుదల కావాల్సిన నోటిఫికేషన్ ప్రకటన ఆగిపోయాయి. ఏప్రిల్ 14వ తారీఖున వర్గీకరణ అమలులోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియను షురూ చేశాయి. గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను సవరించి పంపంచాలని ఇప్పటీకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధిత విభాగాలకు లేఖలు కూడా రాసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలు పంపిస్తున్నాయి.
⦿ త్వరలో రానున్న ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవే..
జాబ్ క్యాలెండర్‌లో పేర్కొన్న విధంగా.. గ్రూప్స్, టీచర్, పోలీసు, విద్యుత్తు, గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బ్యాక్‌లాగ్ గా మారిన ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. గ్రూప్స్ నోటిఫికేషన్ తో పాటు ఇంజినీరింగ్, గురుకుల, టీచర్ ఉద్యోగాలు రానున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10 వేల వరకు పోస్టులు ఉన్నాయని సమాచారం. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్తు సంస్థల్లోని ఇంజినీరింగ్ విభాగాల్లోనూ 2 నుంచి 3 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. గురుకుల నియామకాల్లో దాదాపు 2 వేల పోస్టులు బ్యాక్‌లాగ్‌గా ఉన్నట్లు సమాచారం.
Also Read: ECIL Recruitment: టెన్త్ అర్హతతో మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. ఇంకెందుకు ఆలస్యం.!