BigTV English

NRSC: డిగ్రీతో హైదరాబాద్‌లో జాబ్స్, లక్షకు పైగా వేతనం, ఇంకా 4 రోజులే!

NRSC: డిగ్రీతో హైదరాబాద్‌లో జాబ్స్, లక్షకు పైగా వేతనం, ఇంకా 4 రోజులే!

NRSC: తెలంగాణ, ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ లేదా బీటెక్ లేదా ఎంటెక్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం హైదరాబాద్ లో చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


హైదరాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్‌ సెంటర్‌(NRSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్‌ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జులై 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 34


నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో సైంటిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఫారెస్ట్రీ&ఎకాలజీ, జియోఇన్ఫర్మాటిక్స్‌, జియాలజీ, జియోఫిక్స్‌, అర్బన్‌ స్టడీస్‌, వాటర్‌ రీసోర్స్‌ విభాగాల్లో వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

సైంటిస్ట్- ఇంజినీర్ పోస్టులు: 34

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, బీఆర్క్ పాసై  ఉండాలి.

వయోపరిమితి: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 జులై 11 వ తేదీ నాటికి ఉద్యోగాన్ని బట్టి వయస్సు జేఆర్ఎఫ్‌కు 28 ఏళ్లు, రీసెర్చ్ సైంటిస్ట్ కు 28 నుంచి 30 ఏళ్లు, ప్రాజెక్ట్ అసోసియేట్ కు 35 ఏళ్ల వయస్సు ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 21

దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 11

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.250 ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.750 ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.56,100 – రూ.1,77,500 జీతం ఉంటుంది. మరి ఇంకెందుక ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.nrsc.gov.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. ఇలాంటి సద్వినియోగం చేసుకోండి.

ALSO READ: JE Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీతో 1340 జేఈ ఉద్యోగాలు, భారీ వేతనం

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 34

దరఖాస్తుకు చివరి తేది: 2025 జులై 11

Related News

Indian Railways: డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే ఎక్స్ లెంట్ లైఫ్, భారీ వేతనం

ECIL Notification: ఈసీఐఎల్ హైదరాబాద్‌లో జాబ్స్.. ఇంటర్వ్యూతోనే ఉద్యోగం.. నెలకు రూ.55వేల జీతం

UPSC: యూపీఎస్సీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ జాబ్‌కు ఎంపికైతే భారీ వేతనం, దరఖాస్తు జస్ట్ ఇంకా..?

BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే లక్షల్లో సాలరీలు, సెలక్షన్ విధానం ఇదే

Prasar Bharati: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. నెలకు రూ.80వేల వరకు జీతం

Canara Bank: డిగ్రీ క్వాలిఫికేషన్‌తో 3500 ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం, దరఖాస్తు ఇంకా 2 రోజులే..?

CDAC POSTS: సీడ్యాక్‌లో ఉద్యోగాలు.. తెలంగాణలోనూ భారీగా వెకెన్సీలు, ఈ అర్హత ఉంటే చాలు..!

Orient Spectra: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025కి హాజరవ్వండి.. రూ.5 లక్షల స్కాలర్‌షిప్ గెలుచుకోండి.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..

Big Stories

×