ఈ రోజుల్లో చాలా మంది బిజీ బిజీగా జీవితాన్ని గడిపేస్తున్నారు. వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో కలిసి అలా సరదాగా ఎంజాయ్ చేసేందుకు బయటకు వెళ్తుంటారు. కొంత మంది వాటర్ ఫాల్స్ దగ్గర జలకాలాడితే, మరికొంత మంది పిక్ నిక్ లో ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకొందరు సినిమా, షికార్లు అంటూ వెళ్తున్నారు. కానీ, చాలా మంది ప్రకృతి ఒడిలో సేద తీరేందుకే ప్రయత్నిస్తున్నారు. రణగొణ ధ్వనులకు దూరంగా ప్రశాంతమైన వాతావరణం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. అయితే, కొన్నిసార్లు ఊహించని ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో చూస్తే మీరూ షాకవ్వాల్సిందే!
ఇంతకీ ఏం జరిగిందటే?
తాజాగా కొంత మంది ఫ్రెండ్స్.. హాలీడే రోజు సరదగా ఎంజాయ్ చేయాలనుకున్నారు. చక్కగా ఏర్పాట్లు చేసుకున్నారు. తినేందుకు ఫుడ్, తాగేందుకు డ్రింక్స్ తీసుకున్నారు. నగరానికి దూరంగా అడవి ప్రాంతంలో చక్కటి పిల్ల కాల్వ దగ్గరికి వెళ్లారు. చక్కటి జల ప్రవాహం కనిపించింది. అందరూ కలిసి అందులో కాసేపు జలకాలాడాలి అనుకున్నారు. అందరూ నీళ్లలోకి దిగారు. కొంత మంది నీళ్ల నుంచి బయటకు వచ్చి ఒడ్డు మీద కూర్చున్నారు. ఇంతలో ఊహించని ఘటన ఎదురయ్యింది. అందరూ భయంతో వణికిపోయారు. కళ్లు మూసి తెరిచే లోగా అక్కడి నుంచి బయటపడ్డారు.
Read Also: రాత్రికి రాత్రే రూ.2000 కోట్లకు అధిపతి అయిపోయాడు.. అంతా ఆ లాటరీ మహిమే!
గట్టు మీద ఉన్న వ్యక్తిపై అనకొండ దాడి
ఫ్రెండ్స్ అంతా నీళ్లలో ఎంజాయ్ చేస్తుండగా, ఓ వ్యక్తి మాత్రం గట్టు మీద కూర్చున్నాడు. వెనుక నుంచి ఓ భారీ అనకొండ చడీ చప్పుడు లేకుండా అతడి దగ్గరికి వచ్చింది. ఒక్కసారిగా అతడి మెడను పట్టుకునే ప్రయత్నం చేసింది. వెంటనే, అలర్ట్ అయిన సదరు వ్యక్తి ఒక్కసారిగా నీళ్లలోకి దునికేశాడు. ఫ్రెండ్స్ అంతా ఆ సీన్ చూసి భయంతో వణికిపోయారు. నీళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. బతుకు జీవుడా అంటూ అక్కడిని సామాను సర్దేశారు. వారిలో ఓ వ్యక్తి ఈ ఘటన ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. లేచిన టైమ్ బాగుంది కాబట్టే సదరు వ్యక్తి మిస్ అయ్యాడని కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి టూర్లకు వెళ్లేటప్పుడు లోకల్ వాళ్లను అడిగి అక్కడి పరిస్థితులను తెలుసుకోవడం మంచిదని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో నెటిజన్లను భయంతో వణికిస్తోంది. పిక్ నిక్ అంటేనే వణికిపోయేలా చేస్తోంది.
Read Also: అరుణాచలం టూర్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC అదిరిపోయే ప్యాకేజీ మీ కోసమే!