ENG vs IND, 2nd Test: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ 5వ రోజులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మ్యాచ్ లో… మొదటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న టీమిండియా గెలుస్తుందని అందరూ అనుకునే లోపు… ఊహించని షాక్ తగిలింది. రెండో టెస్ట్ 5వ రోజు అంటే ఇవాళ… మ్యాచ్ ప్రారంభం కంటే ముందు వర్షం భారీగా పడింది. దీంతో ఉదయం పూట మ్యాచ్ ప్రారంభం కాలేదు. రెండు గంటలకు పైగా.. మ్యాచ్ నిలిచిపోవడంతో పది ఓవర్ల వరకు కుదించారు అంపైర్లు. దీంతో ఇవాళ కేవలం 80 ఓవర్లు మాత్రమే నిర్వహించబోతున్నారు.
ఆట ప్రారంభం.. 10 ఓవర్లు కోత
ఐదవ రోజు ఉదయం భారీ వర్షం కురవడంతో దాదాపు రెండు గంటల మ్యాచ్ ఆగిపోయింది. దీంతో లంచ్ తర్వాత అంటే భారత కాలమానం ప్రకారం ఐదు 15 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 10 ఓవర్లను తగ్గించేశారు అంపైర్లు. దీంతో ఇవాళ కేవలం 80 ఓవర్ల మ్యాచ్ మాత్రమే కొనసాగనుంది. ఇక ఈ మ్యాచ్ లో… టీమిండియా గెలవాలంటే మరో ఆరు వికెట్లు తీస్తే సరిపోతుంది. లేదా మిగిలిన 80 ఓవర్లలో 525 పరుగులు ఇంగ్లాండ్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ 525 పరుగులు చేయడం అసాధ్యం. అదే సమయంలో ఇవాళ మళ్లీ వర్షం కురిస్తే… కచ్చితంగా మ్యాచ్ డ్రా అవుతుంది. కానీ ఇవాళ ఉదయం పూట వర్షం పడక మ్యాచ్ ప్రారంభమై ఉంటే.. ఇప్పటికే ఇంగ్లాండు సగం కంటే ఎక్కువ వికెట్లను కోల్పోయేది. కానీ టీమిండియా కు విలన్ గా వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ టీం సంబరపడిపోతుంది. ఓడిపోయే సమయానికి వరుణుడు.. దేవుడిలా వచ్చి కాపాడాడని అంటున్నారు ఇంగ్లాండ్ ఫ్యాన్స్.
టీమిండియా కెప్టెన్ గిల్ పై ట్రోలింగ్
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ నేపథ్యంలో… డబల్ సెంచరీ తో పాటు సెంచరీ చేసిన కెప్టెన్ గిల్ పై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. రెండో ఇన్నింగ్స్ లో.. త్వరగా డిక్లేర్ ఇస్తే బాగుండేదని కొంతమంది వాదన వినిపిస్తున్నారు. తొందరగా డిక్లేర్ ఇచ్చి ఉంటే ఇవాళ వర్షం… అడ్డంకి గా మారకపోయి ఉండేదని… నిన్ననే ఇంగ్లాండ్ ప్లేయర్ లందరూ అవుట్ అయ్యేవారని కూడా కొంతమంది చెబుతున్నారు. కానీ అలాంటి బంపర్ ఆఫర్ ను గిల్ మిస్ చేసాడని ఫైర్ అవుతున్నారు. అయినప్పటికీ.. టీమిండియా గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని మరికొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఇవాళ వర్షం తర్వాత ప్రారంభమైన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ అత్యంత దారుణంగా ఉంది. నిన్న 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండు ఇవాళ రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. మరో 5 వికెట్లు తీస్తే టీమిండియా కచ్చితంగా గెలుస్తుంది.