E-Paper
Advertisement

Apprentice Jobs: IOCL నుంచి భారీ నోటిఫికేషన్.. ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు, డోంట్ మిస్

Apprentice Jobs: IOCL నుంచి భారీ నోటిఫికేషన్.. ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు, డోంట్ మిస్
Advertisement

భారత ప్రభుత్వ రంగంలోని దిగ్గజ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పైప్‌లైన్స్ డివిజన్‌లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఐదు రీజియన్ల పరిధిలో మొత్తం 394 టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ ట్రేడుల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. అర్హత ఉన్న వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

రీజియన్ల వారీగా ఖాళీలు..

Advertisement

ఈ నోటిఫికేషన్ ద్వారా వెస్ట్రన్ రీజియన్‌లో అత్యధికంగా 136 ఖాళీలు ఉన్నాయి. మిగిలిన వాటిలో ఈస్ట్రన్ రీజియన్ (101), సౌత్ ఈస్ట్రన్ రీజియన్ (63), నార్తన్ రీజియన్ (54), సదరన్ రీజియన్ (40) పోస్టులు ఉన్నాయి. ఇందులో మెకానికల్, ఎలక్ట్రికల్, టి&ఐ (T&I) వంటి సాంకేతిక విభాగాలతో పాటు అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి నాన్-టెక్నికల్ విభాగాలు కూడా ఉన్నాయి.

విద్యార్హతలు, వయోపరిమితి.. 

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి 12వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ (ITI), డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 31 జనవరి 2026 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వయస్సు: 18 నుంచి 24.. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. )

ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం.. 

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా వారి విద్యార్హతల్లో సాధించిన మార్కులు, వైద్య పరీక్షలు మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా జరుగుతుంది. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 28, 2026న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10, 2026.

దరఖాస్తుకు ప్రారంభ తేది: జనవరి 28

దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 10

అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అఫీషియల్ వెబ్ సైట్: https://iocl.com/

ALSO READ: RBI Recruitment: పదో తరగతి అర్హతతో అద్భుతమైన ఉద్యోగం.. రూ. 46 వేల జీతం, అప్లికేషన్ పూర్తి వివరాలివే..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×