Big Stories

Xiaomi 15 Series : 50 MP కెమెరా, లేటెస్ట్ ప్రాసెసర్‌తో షియోమి న్యూ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

Xiaomi 15 Series : షియోమి 15 సిరీస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. Xiaomi లైనప్ Qualcomm లెటెస్ట్ ప్రాసెసర్ Snapdragon 8 gen 4తో వచ్చే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఈ ఫోన్‌పై అనేక లీకులు వస్తున్నాయి. ఇప్పుడు టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ సిరీస్ గురించి మరికొంత సమాచారాన్ని షేర్ చేసింది. Xiaomi 15 ప్రో గురించి కూడా కొంత సమాచారాన్ని అందించారు. ఇది 2K మైక్రో-కర్వ్డ్ డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. స్క్రీన్ సైజ్ వెల్లడించలేదు. అయితే ఇది పాత Xiaomi ఫోన్‌ల మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది.

- Advertisement -

నివేదికల ప్రకారం ఫోన్ వెనుక వైపు కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని చెబుతున్నారు. Xiaomi 15 Pro పెరిస్కోప్ సెన్సార్‌తో పాటు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ప్రధాన సెన్సార్ నుండి కూడా మాక్రో ఫోటోలు తీసుకోవచ్చు. కొత్త Xiaomi ఫోన్ ఎపర్చరు Xiaomi 14 Pro కంటే పెద్దదిగా ఉంటుంది.

- Advertisement -

Also Read : ప్రతిరోజూ రూ. 45 ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 25 లక్షలు మీ సొంతం!

అంతకు ముందు షియోమి 15 సిరీస్‌ను అతి త్వరలో టెస్టింగ్ కోసం తీసుకురావచ్చని DCS తెలిపింది. సెప్టెంబరులో ఫోన్ భారీ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కొత్త Xiaomi స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ఉండొచ్చు. ఇది అల్ట్రాసోనిక్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది.

‘Snapdragon 8 Gen 4’ ప్రాసెసర్‌తో నడిచే ఫోన్‌ను పరిచయం చేసే మొదటి బ్రాండ్ Xiaomi అని టిప్‌స్టర్ తెలిపారు. కొత్త చిప్‌సెట్ కోసం కంపెనీ ప్రత్యేకమైన ఫస్ట్ రైట్స్‌ను పొందింది. Xiaomi 15, Xiaomi 15 Pro కొత్త 8 Gen 4 ప్రాసెసర్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్‌లు అని పేర్కొన్నారు.

Also Read : 6000mAh బ్యాటరీతో ఐక్యూ ఫోన్.. మే 16న లాంచ్!

షియోమీ తర్వాత వన్‌ప్లస్ 13, ఐక్యూ 13 స్మార్ట్‌ఫోన్‌లను ‘స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4’తో లాంచ్ అయే అవకాశం ఉంది. శేషమేమిటంటే గతేడాది విడుదలైన Xiaomi 14 సిరీస్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ను ఇన్‌స్టాల్ చేసిన మొదటి స్మార్ట్‌ఫోన్ సిరీస్. Xiaomi 15 మొదట చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రపంచ మార్కెట్లలోకి విడుదల చేస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News