HPCL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాలను నింపేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, బీఎస్సీ, బీటెక్/బీఈ, డిప్లొమా, సీఏ, ఎంఏ, ఎంబీఏ/పీజీడీఎం పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. ఉద్యోగ వెకెన్సీలు, దరఖాస్తు తేదీలు, వయస్సు, ఉద్యోగ ఎంపిక ప్రక్రియ గురించి సవివరంగా తెలుసుకుందాం.
ముంబయి, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 1వ తేదీ నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 372
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్, ఇంజినీర్ (ఎలక్ట్రికల్), సీఏ, ఆఫీసర్, ఇంజినీర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ఉద్యోగాలు- వెకెన్సీలను చూసినట్లయితే..
1. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 10
2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్): 50
3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ క్వాలిటీ కంట్రోల్: 19
4. ఇంజినీర్(ఎలక్ట్రికల్): 35
5. సీఏ: 24
6. ఆఫీసర్(హ్యూమన్ రీసోర్స్): 06
7. ఇంజినీర్(మెకానికల్): 98
8. ఇంజినీర్(కెమికల్): 26
9. ఆఫీసర్(ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్): 01
10. మేనేజర్(ఇనుస్ట్రుమెంటేషన్): 01
11. ఇంజినీర్(సివిల్): 16
12. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్): 15
13. మేనేజియల్ పోస్టులు: 72
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీటెక్, బీఈ, డిప్లొమా, సీఏ, ఎంఏ, ఎంబీఏ/పీజీడీఎంలో పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 45 ఏళ్ల వయస్సు మించరాదు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 1
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 30
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: సీబీటీ, రాత పరీక్ష, నెట్ స్కోర్, టైపింగ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, తదతర టెస్టుల ఆధారంగా అభ్యర్థులకు ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం రూ.30వేల నుంచి రూ.1,60,000 వరకు జీతం ఉంటుంది. కొన్ని ఉద్యోగాలకు స్టార్టింగ్ వేతనమే రూ.50వేల వరకు ఉంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://hindustanpetroleum.com
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఆలస్యం చేకుండా వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం పొందండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: Prasar Bharati: డిగ్రీతో ప్రసారభారతిలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.25,000 స్టైఫండ్, డోంట్ మిస్
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 372
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 30