Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా, నిర్మాతగా ఓ వెలుగు వెలుగుతున్న వారిలో నటి సమంత(Samantha) ఒకరు. సమంత ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దన్నర కాలం పూర్తి అయిన ఇప్పటికి తనకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇప్పటికీ కూడా అదే స్థాయిలో సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు కేవలం సినిమాలలో మాత్రమే నటించే సమంత ఇటీవల కాలంలో వెబ్ సిరీస్ లపై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతూ బిజీగా ఉన్నారు. మరోవైపు నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలను కూడా స్వయంగా నిర్మిస్తూ ఇండస్ట్రీలో బిజీబిజీగా గడుపుతున్నారు.
జెస్సీగా మాయ చేసిన సామ్
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సమంత చదువుతున్న సమయంలోనే మోడలింగ్ వైపు అడుగులు వేసి అనంతరం సినిమాలలో అవకాశాలను అందుకున్నారు. ఇలా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏం మాయ చేసావే(Yem Maaya Chesave) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే జెస్సీగా అందరి మదిలో గుర్తింపు పొందారు. ఇక ఈ సినిమా తర్వాత సమంత కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతూనే నటుడు నాగచైతన్యను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇలా పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్న ఈ జంట కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.
అమేజింగ్ ఫోటో…
ఇలా విడాకుల తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన సమంత పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొంత సమయం ఇండస్ట్రీకి విరామం ఇచ్చారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యల నుంచి బయటపడిన ఈమె వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు. ఇక సమంత నటిగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసున్న అమ్మాయిగా కూడా గుర్తింపు పొందారు. సమంత సినిమాలలో సంపాదించింది సామాజిక సేవ కోసం ఉపయోగిస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈమెకు అభిమానులుగా మారిపోయారు.
?igsh=MWlnOHFzbnh6cmkxZw%3D%3D
ఇలా సమంత అభిమానులు మాత్రం ఎప్పటికప్పుడు తనపై ఉన్నటువంటి అభిమానాన్ని వినూత్న రీతిలో చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే పలువురు సమంత విగ్రహాలను(Statue) ఏర్పాటు చేసి సమంత కోసం ప్రత్యేకంగా గుడి కట్టి పూజిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరొక అభిమాని సమంత పై ఉన్నటువంటి అభిమానాన్ని వినూత్న రీతిలో చూపించారు. సమంత ఫోటోని ఆ అభిమాని ఏకంగా 800 రూబిక్స్ క్యూబ్స్ తో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు , వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో కాస్త సమంత దృష్టికి వెళ్లడంతో ఆమె స్పందిస్తూ…”ఇది పూర్తిగా పిచ్చి..కానీ ధన్యవాదాలు” అంటూ ఈ వీడియో పై స్పందించడమే కాకుండా తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా జత చేశారు. ఇక ఈ వీడియో చూసినటువంటి అభిమానులు చాలా అద్భుతంగా ఫోటో క్రియేట్ చేశారు అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం పిచ్చి పీక్స్ కి చేరింది అంటూ విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Actress Kajol: రామోజీ ఫిలిం సిటీ పై నటి సంచలన వ్యాఖ్యలు… భయానక ప్రదేశమంటూ!