Pooja Hegde: పూజా హెగ్డే (Pooja Hegde)సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగారని చెప్పాలి. తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే ఒకానొక సమయంలో క్షణం తీరిక లేకుండా సినిమాలలో నటిస్తూ బిజీగా గడిపారు.ఇలా పూజ హెగ్డే సినిమాలలో కనిపించిందంటే చాలు ఆ సినిమా సక్సెస్ అవుతుందని, ఈమె గోల్డెన్ లెగ్ అంటూ ఒకానొక సమయంలో దర్శక నిర్మాతలు ఈమె పై ప్రశంసలు కురిపించారు. ఇలా వరుస సినిమా అవకాశాలను అందుకున్న పూజ పాన్ ఇండియా సినిమాలకు కూడా కమిట్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇకపోతే ఈమె పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోల సరసన నటించిన వరుస చిత్రాలు డిజాస్టర్లుగా నిలవడంతో కెరీర్ పై కోలుకోలేని దెబ్బ పడిందని చెప్పాలి. ప్రభాస్, విజయ్ దళపతి, రామ్ చరణ్ అవంటి అగ్ర హీరోల సరసన నటించిన ఈమెకు మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఇలా వరుస డిజాస్టర్ సినిమాలు ఎదురవడంతో ఐరన్ లెగ్ అంటూ ఈమె పై విమర్శలు కూడా వచ్చాయి. వరస ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే కు సినిమా అవకాశాలు కూడా రాలేదు దీంతో కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ కేవలం సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అవకాశాలకు వలవేశారు.
నిరాశపరచిన రెట్రో….
ఇలా చాలా విరామం తర్వాత ఈమెకు తమిళ హీరో సూర్య(Suriya) నటిస్తున్న రెట్రో(Retro) సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ద్వారా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకున్న ఈమెకు ప్రేక్షకుల నుంచి నిరాశ ఎదురయింది. ఇలా ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం పూజ హెగ్డే గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అవకాశాల కోసం ఇండస్ట్రీలో పాత మేనేజర్లతో పాటు దర్శక నిర్మాతలు అందరికీ వరుసగా ఫోన్ కాల్ చేయడం, మెసేజ్ లు చేస్తూ అవకాశాల వేటలో పడ్డారని తెలుస్తోంది.
అవకాశాల వేటలో బుట్ట బొమ్మ…
ఇలా అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న పూజ హెగ్డేను నమ్మి ఏ దర్శకుడు లేదా నిర్మాత అయిన తనకు అవకాశం ఇస్తారా? అవకాశం ఇచ్చిన మరోసారి తన టాలెంట్ ను పూజా హెగ్డే నిరూపించుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు అవకాశాలు లేకపోవడంతో అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ అవకాశాలను అందుకున్న పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాలలో నటించడం కోసం కొన్ని సూపర్ హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నారనే చెప్పాలి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సరైన అవకాశాలు లేవని తెలుస్తోంది. మరి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న పూజ ప్రయత్నాలు ఫలించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Samantha: 800 రూబిక్స్ క్యూబ్స్ తో సమంత ఫోటో.. నీ పిచ్చి తగలెయ్యా.. వీడియో వైరల్!