Indian Army Jobs: నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. డిగ్రీ, బీఈ, బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇది శుభవార్త. భారత రక్షణ రంగంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసకోవచ్చు. ఎలా రాతపరీక్ష లేకుండానే ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులక భారీ వేతనం కూడా ఇవ్వనున్నారు.
ఇంజినీరింగ్ చేసిన అవివాహిత పురుషులూ, మహిళలూ అభ్యర్థులకు భారత రక్షణ రంగం గుడ్ న్యూస్ చెప్పింది. పలు రకాలను ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆహ్వానం పలుకుతోంది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) విధానంలో 379 టెక్ పోస్టులకు భారత రక్షణ రంగం ప్రకటన రిలీజ్ చేసింది. వీటిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ (PCTA)లో అక్టోబరు- 2025 కోర్సు ప్రారంభం అవ్వనుంది. దరఖాస్తుకు ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఫిబ్రవరి 3వ తేదిన దరఖాస్తు గడువు ముగియనుంది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 379
ఇందులో వివిధ రకాలు ఉద్యోగాలున్నాయి. 379 టెక్ పోస్టులకు ఫ్రీ-కమిషనింగ్ ట్రైనింగ్ అకాడమీ(పీసీటీఏ) అకోటబర్-2025 కోర్సు ద్వారా భర్తీ చేయనున్నారు.
పురుషులకు 350 పోస్టులు, మహిళలకు 29 పోస్టులు కేటాయించారు.
ఖాళీల వివరాలు..
పురుషులు : 350 ఉద్యోగాలు
విభాగాల వారీగా: సివిల్- 75; కంప్యూటర్ సైన్స్ – 60; ఎలక్ట్రికల్ – 33; ఎలక్ట్రానిక్స్ – 64; మెకానికల్ – 101; మిస్సైల్ ఇంజినీరింగ్ – 17.
మహిళలు: 29 ఉద్యోగాలు
విభాగాల వారీగా: సివిల్- 07; కంప్యూటర్ సైన్స్ – 04; ఎలక్ట్రికల్ – 03; ఎలక్ట్రానిక్స్ – 06; మెకానికల్ – 09.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బీఈ/బీటెక్ పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు 2025 అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల వయస్సు మద్య ఉండాలి.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.56,000 నుంచి రూ.2,50,000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 2025 ఫిబ్రవరి 65
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కావాలనుకునే అభ్యర్థులు అఫీషియల్ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.joinindianarmy.nic.in
అర్హత ఉన్న అభ్యర్థులందరూ వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బీఈ/బీటెక్ పాసైన అభ్యర్థులందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందకు అర్హులవుతారు. కోర్సు అనంతరం ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థలకు భారీ వేతనం ఉంటుంది. ప్రారంభంలోనే రూ.56,000 వేతనం ఉండనుంది. దరఖాస్తుకు మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. వెంటేనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: RRB Recruitment: రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. నెలకు జీతం రూ.48,000.. ఇంకా నాలుగు రోజుల ఛాన్స్
ముఖ్యమైనవి:
దరఖాస్తు చివరి తేది: 2025 ఫిబ్రవరి 5
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 379
వయస్సు: 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.56,000 – రూ.2,50,000 మధ్య ఉంటుంది.