BigTV English

Gongura Endu Royyalu Curry: నాన్ వెజ్ ప్రియులకు నచ్చేలా గోంగూర ఎండురొయ్యల కూర రెసిపీ, స్పైసీగా అదిరిపోతుంది

Gongura Endu Royyalu Curry: నాన్ వెజ్ ప్రియులకు నచ్చేలా గోంగూర ఎండురొయ్యల కూర రెసిపీ, స్పైసీగా అదిరిపోతుంది

నాన్ వెజ్‌ను ఇష్టంగా తినేవారికి ఎండు రొయ్యలతో చేసిన కూర ఎంత రుచిగా ఉంటుందో అర్థమవుతుంది. ఎండు రొయ్యలు, ఎండు చేపలు వంటివి కూడా ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలోకే వస్తాయి. ఇక్కడ మేము గోంగూర ఎండు రొయ్యలు రెసిపీ ఇచ్చాము. దీన్ని వండుకుంటే కొంచెం కూరే ఎక్కువ అన్నంలో కలుస్తుంది. పైగా రుచిగా కూడా ఉంటుంది. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో గోంగూర ఎండు రొయ్యల కూర వండుకొని చూడండి.


గోంగూర ఎండు రొయ్యలు కూరకు కావలసిన పదార్థాలు
ఎండు రొయ్యలు – 200 గ్రాములు
గోంగూర తరుగు – 100 గ్రాములు
నీళ్లు – సరిపడినన్ని
నూనె – పావు కప్పు
కరివేపాకులు – గుప్పెడు
ఉల్లిపాయ – ఒకటి
జీలకర్ర – ఒక స్పూను
ఆవాలు – ఒక స్పూను
శనగపప్పు – ఒక స్పూను
మినప్పప్పు – ఒక స్పూన్
పసుపు – ఒక స్పూను
గరం మసాలా – అర స్పూను
కారం – ఒక స్పూను
ఉప్పు -రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను

గోంగూర ఎండు రొయ్యలు కూర రెసిపీ
1. గోంగూరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఎండు రొయ్యలను కూడా తల, తోక తీసేసి నీళ్లలో వేసి పావుగంట సేపు నానబెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకులు, ఆవాలు వేసి వేయించాలి.
5.అవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి వేయించుకోవాలి.
6.అందులోనే పసుపును కూడా వేయాలి.
7. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రొయ్యలను వేసి బాగా వేయించాలి.
8. పావు గంటసేపు చిన్నమంట మీద వేయించుకోవాలి.
9.ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి బాగా వేయించాలి.
10.ఇది మొత్తం దగ్గరగా ఇగురులాగా అవుతుంది.
11. అప్పుడు గోంగూర ఆకులను వేసి పైన మూత పెట్టి మగ్గించుకోవాలి.
12. పావుగంట తర్వాత గోంగూర ఆకులు మెత్తగా అయ్యి అందులో నుంచి నీరు విడుదలవుతుంది.
13. ఈ గోంగూర ఆకులు ఉడుకుతున్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు, కారము, గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి.
14. ఇది మొత్తం ఇగురులాగా దగ్గరగా అయ్యేవరకు వచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి.
15. అంతే టేస్టీ ఎండు రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయినట్టే.
16. ఇది తింటున్న కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.


Also Read: పాలకూరతో స్పైసీ పచ్చడి ఇలా చేసేయండి, ఆరోగ్యం పైగా ఎంతో రుచి

పచ్చి రొయ్యల్లాగే ఎండు రొయ్యలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక గోంగూరలో ఉండే విటమిన్ సి మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ రెండింటినీ కలిపి చేసే ఈ కూర అద్భుతంగా ఉండటం ఖాయం. పైగా ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గోంగూర ఎండు రొయ్యలను చాలా ప్రత్యేకంగా వండుతారు. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో కూడా ఈ కూర ఎంతో స్పెషల్.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×