BECIL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా(BECIL)లో పలు ఉద్యోగాల భర్తీనిక నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం లో ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లిభిస్తుంది.
బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL).. కాంట్రాక్ట్ విధానంలో ఎయిమ్స్ జమ్మూ పరిధిలోని వివిధ విభాగాల్లో 407 ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 24 తేదీన దరఖాస్తు గడవు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 407
బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ డైటీషియన్, చీఫ్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, కోడింగ్ క్లర్క్, జూనియర్ ఇంజినీర్, డీఈఓ, జూనియర్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, సీనియర్ హిందీ ఆఫీసర్, లైబ్రేరియన్, స్టోర్ కీపర్, స్టోర్ ఆఫీసర్, గ్రాఫిక్ డిజైనర్, జూనియర్ రిసెర్చ్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ పాసై ఉండాలి. అలాగే వర్స్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
ఉద్యోగ ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు రూ.590 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో రాయితీ ఉంటుంది. వారు అప్లికేషన్ ఫీజు: 295 చెల్లిస్తే సరిపోతుంది.
ఉద్యోగ దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు టెన్త్, ఇంటర్, డేట్ ఆఫ్ బర్త్, కాస్ట్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్, పాన్ కార్డు కాపీ, ఆధార్ కార్డ్, ఈపీఎఫ్/ ఈఎస్ఐసీ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ ఉండాలి.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. రూ.19,900 నుంచి రూ.78,800 వరకు వేతనం ఉంది.
చిరునామా: బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, బీఈసీఐఎల్ భవన్, సెక్టార్ 62, నోయిడా (యూపీ) చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ డ్ పోస్ట్ ద్వారా వివరాలను పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 24
పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.becil.com/
Also Read: AP Govt: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. కోడికి రూ.140.. ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు కు ఇంకా పది రోజుల సమయం మాత్రమే ఉంది. వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.