వాలెంటైన్స్ డే సందర్భంగా ఏ తేదీలో జన్మించిన వ్యక్తులు ఆదర్శ భాగస్వాములుగా ఉంటారో తెలుసుకుందాం. కొన్ని తేదీల్లో జన్మించిన వారు జీవితాంతం తమ జీవిత భాగస్వామితోనే ఉండేందుకు ఇష్టపడతారు. వారిని అపురూపంగా చూసుకుంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో జన్మించిన వారు ఉత్తమ భాగస్వాములు అవుతారని తెలుస్తోంది.
మూల సంఖ్య 1
ఏ నెలలోనైనా ఒకటి, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారికి మూల సంఖ్య 1 ఉంటుంది. అలాంటి వారు మూల సంఖ్య ఒకటి ఉన్న వ్యక్తులకు 2, 3, 4, 9 మూల సంఖ్య కలవారిని పెళ్లి చేసుకుంటే ఆదర్శ భాగస్వాములుగా ఉంటారు
మూల సంఖ్య 2
ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారి సంఖ్య మూల సంఖ్య 2గా చెప్పుకుంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం వీరికి 1, 7, 3 మూల సంఖ్యగా ఉన్న వ్యక్తులను వివాహం చేసుకుంటే సరైన జీవిత భాగస్వాములుగా అవుతారు.
మూల సంఖ్య 3
ఏదైనా నెలలో 2, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వ్యక్తులకు మూల సంఖ్య 3 అవుతుంది. మీరు మూల సంఖ్య 1,2, 5, 7, 3 గల వ్యక్తులను పెళ్లి చేసుకుంటే అద్భుతమైన జీవిత భాగస్వాములుగా పనికొస్తారు.
మూల సంఖ్య 4
ఏ నెలలోనైనా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య 4. ఈ 4 మూల సంఖ్య గల వ్యక్తులు 1, 2, 9 మూల సంఖ్యగా ఉన్న వారిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకుంటే ఆదర్శ భాగస్వాములుగా మిగిలిపోతారు.
మూల సంఖ్య 5
ఏ నెలలోనైనా 5, 14, 23వ తేదీల్లో జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య 5గా చెబుతారు. ఇలాంటి వారు 1, 3, 6, 7, 8 మూల సంఖ్యగా ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకుంటే మంచిది. వీరిద్దరి జీవితం అద్భుతంగా ఉంటుంది.
మూల సంఖ్య 6
ఈ నెలలోనైనా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య 6. కాబట్టి 6 మూల సంఖ్య కలవారు 3, 4, 5, 6 సంఖ్యను మూల సంఖ్యగా ఉన్న వారిని పెళ్లి చేసుకుంటే ఆదర్శవంతమైన జీవిత భాగస్వామిగా మిగిలిపోతారు.
మూల సంఖ్య 7
ఒక వ్యక్తి ఏదైనా నెలలో 7, 16, 25 తేదీలలో జన్మించినట్లయితే అతని/ఆమె మూల సంఖ్య 7గా చెబుతారు. మూల సంఖ్య 7 ఉన్న వ్యక్తులు మూల సంఖ్య 3, 5, 8 మూల సంఖ్య ఉన్న వ్యక్తులను పెళ్లి చేసుకోవాలి.
మూల సంఖ్య 8
ఈ నెలలోనైనా 8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తి మూల సంఖ్య 8గా చెబుతారు. అలాంటివారు 2, 4, 7, 9 మూల సంఖ్య గల వ్యక్తులను పెళ్లి చేసుకుంటే మంచిది. వారిది అన్యోన్య దాంపత్యంగా మారుతుంది.
మూల సంఖ్య 9
ఒక వ్యక్తి ఈ నెలలో 9 18 27 తేదీలలో జన్మించినట్లయితే అతని మూల సంఖ్య 9 అవుతుంది అలాంటివారు మూల సంఖ్య రెండు మూడు ఆరు లేదా ఎనిమిది అనే సంఖ్య లో మూల సంఖ్యలుగా ఉన్న వారిని ఎంపిక చేసుకోవాలి వీరికి మంచి జీవితం ముందుంటుంది
మూల సంఖ్య ఎలా లెక్కిస్తారు?
ఒక వ్యక్తి 18వ తారీఖున జన్మిస్తే 18లో ఉన్న 1+8 అంకెలను కలిపితే 9 వస్తుంది. అదే వారి మూల సంఖ్య.
Also Read: సూర్యదేవుని రథానికి ఉండే ఏడు గుర్రాలు పేర్లు ఏమిటో, అవి వేటిని సూచిస్తాయో తెలుసా?