Dharmavarapu Subramanyam: ధర్మవరపు సుబ్రహ్మణ్యం (Dharmavarapu Subramanyam).. దిగ్గజ లెజెండ్రీ కమెడియన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆయనను తలుచుకుంటూ ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి కోరిక ఏంటి? అంటూ అభిమానులు ఆరా తీయగా.. ఆయన భార్య చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా చివరి కోరిక తీరకుండానే చనిపోయిన సుబ్రహ్మణ్యం 12 ఏళ్లయినా.. ఆయన కుటుంబ సభ్యులు ఆ కోరికను తీర్చ లేదని తెలిసి అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. మరి సుబ్రహ్మణ్యం తీరని కోరిక ఏంటి? ఎందుకు కుటుంబ సభ్యులు నెరవేర్చడంలో వెనకడుగు వేస్తున్నారు? అనే విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. సినీ ఇండస్ట్రీలో అలుపెరగని నటుడిగా ఒక మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. రంగస్థలం నుంచి టీవీ స్క్రీన్ వరకు.. అటు వెండితెరపై ఎన్నో పాత్రలు పోషించి మంచి పేరు దక్కించుకున్న ఈయన.. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా మారిన ఈయన.. అనూహ్యంగా లివర్ క్యాన్సర్ బారినపడి.. అది కూడా నాలుగవ స్టేజ్ లో ఉన్నప్పుడు గుర్తించడంతో ఇక చేసేదేమీ లేక ఏడాది కాలం పాటు పోరాడి చివరికి 2013లో కన్నుమూశారు. అంతేకాదు చివరి రోజుల్లో మానసిక వేదనను అనుభవించినట్లు ఆయన భార్య కృష్ణజ (Krishnaja )మీడియాతో తెలియజేశారు. ఆయన ఇష్టాలను, చివరి కోరికను కూడా ఆమె బయట పెట్టారు.
చివరి కోరిక తీరకుండానే మరణించిన సుబ్రహ్మణ్యం..
ధర్మవరపు సుబ్రహ్మణ్యం భార్య కృష్ణజా మాట్లాడుతూ..” ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు చిన్నపిల్లవాడిలా ఏడ్చేవారు. తన పరిస్థితి ఇలా అయ్యిందేంటని ఎక్కువగా బాధపడేవారు. ఆ సమయంలో ఆయనను ఎంతో ఓదార్చే వాళ్ళం. అయితే ఆయనకి తన మనవళ్ళను చూడాలనే కోరిక చాలా ఉండేది. ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు. అయితే తాను లేకపోయినా ఇండస్ట్రీలో తన పేరును నిలబెట్టాలని రెండవ అబ్బాయి తేజ దగ్గర మాట తీసుకున్నారు. పెద్దబ్బాయి సందీప్ బిజినెస్ లో స్థిరపడ్డారు. రెండవ అబ్బాయి రవి బ్రహ్మ తేజ కూడా ఉద్యోగం చేసి మానేసి, ప్రస్తుతం తండ్రి బాటలోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఇంకా అవకాశాలు రాలేదు. నా భర్త లాగే నా కొడుకు తేజ కూడా మంచి కమెడియన్ లా పేరు తెచ్చుకోవాలని మేము కలలు కంటున్నాము” అంటూ కృష్ణజ తెలిపింది.
also read:Shraddha Kapoor: లేట్ వయసులో రిలేషన్షిప్… కన్ఫర్మ్ చేసిన శ్రద్ధా.. పోస్ట్ వైరల్
కనీసం కొడుకు అయినా తీరుస్తారా?
మొత్తానికైతే ధర్మవరపు సుబ్రహ్మణ్యం చివరి కోరికను చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది కృష్ణజ. ఇకపోతే ధర్మవరపు సుబ్రహ్మణ్యం కోరిక నెరవేరాలి అంటే ఇండస్ట్రీ పెద్దలు కాస్త చనువు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఎవరైనా ఆ అడుగు ముందుకేసి తేజాకు తమ సినిమాలలో అవకాశం కల్పించి తన తండ్రి అంత ఎత్తుకు ఎదిగేలా చెయ్యాలి అని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.