BigTV English

Oscar Awards 2026: ఆస్కార్‌ నామినేషన్స్‌.. పుష్ప 2తో పోటీ పడుతున్న ‘కన్నప్ప’

Oscar Awards 2026: ఆస్కార్‌ నామినేషన్స్‌.. పుష్ప 2తో పోటీ పడుతున్న ‘కన్నప్ప’


Oscar Awards 2026: చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అవార్డుల్లో ఆస్కార్ఒకటి. నటినటుడైన తమ జీవితకాలంలో ఒక్కసారైన ఆస్కార్అవార్డు పొందాల కలలు కంటాడు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలోకి అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులను మాత్రమే అవార్డు వరిస్తుంది. ఇండియన్సినిమాకు అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్కలను ఆర్ఆర్ఆర్మూవీ తీర్చింది. ప్రతి ఏడాది అకాడమీ అవార్డు కోసం ఎన్నో వందల చిత్రాలు పోటీ పడుతుంటాయి. ఇందుకోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో వివిధ దేశాలు అధికారికంగా ఆస్కార్ కమిటీకి నామినేషన్స్ పంపించడం ప్రతి ఏడాది జరుగుతుంది. వచ్చే ఏడాది అకాడమీ అవార్డు కోసం ఇండియన్ సినిమా నుంచి  పింపించిన చిత్రాల్లో జాన్వీ కపూర్నటించిన ‘హోమ్ బౌండ్’ మూవీ అధికారికంగా పంపించారు.

మొత్తం 24 సినిమాలు..

అలాగే ఫిలిం ఫెడరేషన్ఆఫ్ఇండియా తెలుగు సినిమాలను కూడా ఆస్కార్ కమిటీకి ప్రతిపాదించింది . మొత్తం ఈ జాబితాలో వివిధ భాషలకు చెందిన  24 చిత్రాలు ఉన్నాయి. అందులో ఇప్పటికే జాన్వీ కపూర్‌ ‘హోమ్ బౌండ్’ ఆఫీషియల్గా ఎంట్రీ పొందడం విశేషం. అయితే ప్రతిపాదన జాబితాలోహోమ్ బౌండ్’తో పాటు విక్టరి వెంకటేష్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం‘, ‘పుష్ప 2′, మంచు విష్ణుకన్నప్ప‘, డైరెక్టర్సుకుమార్కూతురు నటించిన గాంధీ తాత చెట్టు, అలాగే శేఖర్కమ్ముల కుబేర చిత్రాలను కూడా పేర్కొన్నడం విశేషం. అయితే ఇందులో చిత్రం నామినేషన్కి వెళ్లి.. బెస్ట్ఫిచర్ఫిలింగా ఎంపికవుతుందనేది చూడాలి. అలాగే హిందీలో వాంట్టూ వాక్‌, తన్వీ ది గ్రేట్‌, ది బెంగాల్ఫైల్స్‌, హోమ్ బౌండ్, కేసరి చాప్టర్‌ 2, సూపర్బాయ్ఆఫ్ మెలిగోన్వంటి చిత్రాలు ఉన్నాయి.


జాన్వీ కపూర్ సినిమాకి ఆఫీషియల్ ఎంట్రీ

అలాగే మరాఠి, కన్నడ భాషకు సంబంధించిన సినిమాలు కూడా జాబితాలో ఉండటం విశేషం.  కాగా బాలీవుడ్బ్యూటీ జాన్వీ కపూర్నటించినహోమ్బాండ్‌’ మూవీ విడుదలకు ముందే ఆఫీషియల్గా అకాడమీ అవార్డు నామినేషన్లో నిలవడం విశేషం. జాన్వీ కపూర్‌, యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్, విశాల్ జత్వా ప్రధాన పాత్రల్లో నీరజ్ ఘేవాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాను నిర్మాత కరణ్జోహార్నిర్మించారు. అయితే హోమ్బాండ్చిత్రం ఇంకా ఇండియాలో ఇంకా విడుదల కాలేదు. కేన్స్ చలన చిత్రోత్సవాల్లో గత ఏడాది ప్రదర్శించగా… వీక్షకుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ లభించింది. సినిమా పూర్తి అయ్యాక అందరూ లేచి చప్పట్లు కొట్టిన ద్రశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.

Also Read: Bandla Ganesh Tweet : నాయకత్వాన్ని కెలికిన బండ్లన్న… ఈ ట్వీట్ ఆయనను ఉద్దేశించేనా?

ఇక భారత్లో చిత్రం వచ్చే వారం సెప్టెంబర్ 26న విడుదల కానుంది. రిలీజ్ కు ముందే సినిమా ఆస్కార్ ఎంట్రీని పొందడంతో మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇది సినిమా ప్రమోషన్స్కి మరింత ప్లస్అయ్యింది. హోమ్ బౌండ్ మూవీ విషయానికి వస్తే.. ఉత్తర భారతదేశంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పోలీసులు కావాలని కలలు కంటారు. బాల్యం నుంచి కుల వివక్ష ఎదుర్కోవడంతో ప్రభుత్వం పరమైన ఉద్యోగంలో ఉంటే గుర్తింపు, గౌరవం దక్కుతుందని భావించి పోలీసులు కావాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. తమ కలను చేరుకునే ప్రయత్నంలో వారికి ఎదురైన అనుభవాలు? తమ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో యువకులకు ఎదుర్కొన్న చేదు అనుభవాలు? ఏంటనేది మూవీ కథ.

Related News

SDT: సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ.. దిగ్గజాలంతా ఒకే చోట.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీనా.?

Sunny leone : మళ్లీ యూటర్న్ తీసుకున్న సన్నీలియోన్.. రిస్క్ చేస్తోందా?

OG Pre Release Event: రేపే ప్రీ రిలీజ్‌ ఈవెంట్… పవన్‌ కోసం రెండు స్టేజ్‌లు.. అసలు సంగతేంటంటే ?

OG Premiere : తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా.. ఓజీ సినిమాపై గందరగోళం!

Ramgopal Varma: శివ రీ రిలీజ్… వర్మ షాకింగ్ రియాక్షన్ …పిల్లల సినిమా కాదు కానీ!

Dharmavarapu Subramanyam: చనిపోయి 12 ఏళ్ళైనా తీరని చివరి కోరిక.. ఏంటంటే?

OG Movie : ఓజీ మూవీ బిగ్ డిజాస్టార్… కారణం పవన్ కళ్యాణే ?

Big Stories

×