BigTV English

Prasar Bharati: అద్భుతమైన అవకాశం.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. సైఫండ్ ఇచ్చి ఉద్యోగం

Prasar Bharati: అద్భుతమైన అవకాశం.. డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. సైఫండ్ ఇచ్చి ఉద్యోగం

Prasar Bharati: ప్రసారభారతిలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ప్రసార భారతి అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. జూన్ 30న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగాలు, వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, వయస్సు, జీతం, తదితర వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.


ప్రసారభారతిలో టెక్నీషియన్ ఇంటర్న్స్ కోసం నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 421 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 421


ప్రసారభారతి టెక్నికల్ ఇంటర్న్ పోస్టులను భర్తీ చేస్తోంది.

పోస్టు పేరు: ప్రసారభారతి టెక్నికల్ ఇంటర్న్స్

పోస్టులు – వెకెన్సీలు:

టెక్నికల్ ఇంటర్న్స్ ఇన్ సౌత్ జోన్: 63 పోస్టులు

టెక్నికల్ ఇంటర్న్స్ ఇన్ ఈస్ట్ జోన్: 65 పోస్టులు

టెక్నికల్ ఇంటర్న్స్ ఇన్ వెస్ట్ జోన్: 66 పోస్టులు

టెక్నికల్ ఇంటర్న్స్ ఇన్ నార్త్ ఈస్ట్ జోన్: 126 పోస్టులు

టెక్నికల్ ఇంటర్న్స్ ఇన్ న్యూఢిల్లీ: 101 పోస్టులు

స్టైఫండ్: సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ ఉంటుంది. నెలకు రూ.25,000 చొప్పున స్టైఫండ్ ఇస్తారు. ఉద్యోగంలోకి తీసుకున్న తర్వాత జీతం పెంచే అవకాశం ఉంటుంది.

విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ లేదా ఇంజినీరింగ్ పాసై ఉండాలి. 2024-25 లో డిగ్రీ పాసైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు దాటరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://prasarbharati.gov.in/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. సెలెక్ట్ అయిన వారికి రూ.25వేల స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: HVF: హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో 1850 ఉద్యోగాలు.. మంచి వేతనం, లాస్ట్ డేట్?

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 421

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 30

స్టైఫండ్: నెలకు రూ.25వేలు

Related News

JOBS: యూబీఐలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం, ఇంకెందుకు ఆలస్యం

BANK OF BARODA: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. భారీ వేతనం, ఇదే మంచి అవకాశం బ్రో

Indian Navy Jobs: పదితో ఇండియన్ నేవీలో భారీగా జాబ్స్.. దరఖాస్తుకు చివరి తేది ఇదే

Indian Railway: ఇండియన్ రైల్వేలో 2865 పోస్టులు.. టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసైతే చాలు.. ఇదే మంచి అవకాశం

IBPS Clerk Jobs: భారీ గుడ్ న్యూస్.. క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు.. ఇంకా 6 రోజుల సమయం

Police Jobs: 3588 కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా..? జీతం అక్షరాల రూ.69,100

Big Stories

×