DSSSB Recruitment: నిరుద్యోగులకు ఇది సూపర్ ఛాన్స్. బీఎడ్ (B.Ed)తో పాటు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎన్‌సీటీఈ గుర్తింపు కలిగిన తత్సమాన అర్హత కలిగి ఉన్న అభ్యర్థులకు సువర్ణ అవకాశం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (DSSSB)లో పలు పోస్టుల భర్తీకి జనవరి 16 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఫిబ్రవరి 14వ తేది లోపు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఢిల్లీ, సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) పలు సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTలు) రిక్రూట్‌మెంట్ కోసం జనవరి నెలలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఢిల్లీలోని ఎన్‌సిటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇతర అనుబంధ సంస్థలలో 432 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషణన్ పూర్తి వివరాలను ఓ సారి చూసేద్దాం.
మొత్తం పోస్టుల ఖాళీల సంఖ్య: 432
ఢిల్లీ, సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. పీజీటీ (హిందీ), పీజీటీ (గణితం), పీజీటీ (ఫిజిక్స్), పీజీటీ (కెమిస్ట్రీ), పీజీటీ (బయాలజీ), పీజీటీ (ఎకనామిక్స్), పీజీటీ (కామర్స్), పీజీటీ (హిస్టరీ), పీజీటీ (జాగ్రఫీ), పీజీటీ (పొలిటికల్ సైన్స్), పీజీటీ (సోషయాలజీ) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు ఖాళీల వారీగా:
పీజీటీ (హిందీ) – 91
పీజీటీ (గణితం) – 31
పీజీటీ (ఫిజిక్స్) – 5
పీజీటీ (కెమిస్ట్రీ) – 7
పీజీటీ (బయాలజీ) – 13
పీజీటీ (ఎకనామిక్స్) – 82
పీజీటీ (కామర్స్) – 37
పీజీటీ (చరిత్ర) – 61
పీజీటీ (జాగ్రఫీ) – 22
పీజీటీ (పొలిటికల్ సైన్స్) – 78
పీజీటీ (సోషియాలజీ) – 5
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా బీఈడీతో పాటు సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎన్‌సీటీఈ గుర్తింపు కలిగిన తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు.
వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు పే లెవెల్-8 ప్రకారం నెల జీతం రూ.47,600 నుంచి రూ.1,51,100 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఢిల్లీ, సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: సీబీటీ ఎగ్జామ్, మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: 2025 జనవరి 16
దరఖాస్తుక ప్రక్రియకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 14
నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://dsssb.delhi.gov.in/
Also Read: NTPC Recruitment 2025: 475 ఉద్యోగాలకు రేపే లాస్ట్ డేట్.. స్టార్టింగ్ జీతమే అక్షరాల రూ.40,000
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఢిల్లీ, సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ లో ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తుకు జస్ట్ ఇంకా రెండు రోజుల ఛాన్స్ మాత్రమే ఉంది. ఇందులో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా కల్పించనున్నారు. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.