KTR Tweet: కేటీఆర్ చేసిన ట్వీట్.. నాటి బీఆర్ఎస్ పాలనకు ప్రత్యక్ష సాక్ష్యమని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక్క ఝలక్ తో కేటీఆర్ అలర్ట్ అయ్యారు. వెంటనే తన టీం ను అప్రమత్తం చేసి, ఆ ట్వీట్ డిలీట్ చేయించారు. బీఆర్ఎస్ పాలనలో రైతుల ఇబ్బందులను లోకానికి చాటి చెప్పిన మాజీ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ అభినందనలు తెలిపింది. ఇంతకు కేటీఆర్ చేసిన ట్వీట్ ఏమిటి? వెంటనే డిలీట్ ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం.
మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు. ఛాన్స్ దొరికితే చాలు, కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తారు. కేటీఆర్ ట్వీట్ చేస్తారో లేక ఆయన పిఆర్ టీం చేస్తారో కానీ, ఇటీవల ఒక్క ట్వీట్ కి నాలుక కరచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి.. రుణమాఫీ అమలు చేశారు. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ కాగా, రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. అన్నీ అర్హతలు గమనించి ఈ పథకాన్ని ప్రభుత్వం లబ్దిదారులకు ప్రభుత్వం వర్తింపజేసింది. ఆ తర్వాత సన్నబియ్యం సాగు చేసిన రైతులకు అదనంగా రూ. 500 నగదును కూడ ప్రభుత్వం అందించింది. అంతేకాదు జనవరి 26 న రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించి, ఇప్పటికీ పలు దఫాలుగా రైతన్నల ఖాతాలకు నగదు బదిలీ చేసింది.
ఇలా తెలంగాణ రైతాంగం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ఇన్ని పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రభుత్వం రైతన్నలను పట్టించుకోవడం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఇది ఇలా ఉంటే ఓ ట్వీట్ చేశారు కేటీఆర్. ప్రభుత్వంపై బురదజల్లేందుకు కేటీఆర్ చేసిన ట్వీట్.. తిరిగి ఆ బురద ఆయనకే అంటుకుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అసలేం జరిగిందంటే.. మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల తెలంగాణ రైతుల దుస్థితి ఇదీ అంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో ఓ రైతు కష్టపడుతున్న వీడియోను పోస్ట్ చేశారు. చూశారా.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రైతన్నల పరిస్థితి ఇదీ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల మార్కెట్ నుండి రాబడి రాని ఖమ్మం జిల్లా నామవరం గ్రామంలోని మిరప రైతు చింతిర్యాల కోటేశ్వరరావు దుస్థితి అంటూ ఆ వీడియో సారాంశం.
అక్కడే పప్పులో కాలేశారు కేటీఆర్ పిఆర్ టీం. కేటీఆర్ ట్వీట్ లో రైతు పడ్డ ఆవేదన నిజమే. ఆ రైతు పరిస్థితి వాస్తవమే. కానీ ఆ వీడియో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసిన వీడియో. 2018 వ సంవత్సరంలో తీసిన వీడియోను 2025 లో పోస్ట్ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రైతుల ఇబ్బందులంటూ పోస్ట్ చేయడంతో అందరూ షాక్ కు గురయ్యారు. అసలు నిజం గ్రహించిన కేటీఆర్ పిఆర్ టీం వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసింది. దీనితో కాంగ్రెస్ నాయకులు సెటైర్లు వేస్తూ కేటీఆర్ ట్వీట్ కి రీట్వీట్ చేశారు.
Also Read: కేసీఆర్, కేటీఆర్ లకు మరో అవకాశం.. ఇప్పటికైనా మారండంటూ తేదీలు ఖరారు చేసిన భట్టి
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. తన తండ్రి ప్రభుత్వాన్ని, అప్పటి లోపాలను విమర్శించినందుకు కేటీఆర్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ సీఎం హోదాలో తనను బీఆర్ఎస్ పార్టీపై, తండ్రి కెసిఆర్ పై కేటీఆర్ ఇలా పగ తీర్చుకుంటున్నారని ఎంపీ కౌంటర్ వేశారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతులు పెరుగుతున్న అప్పులతో ఇబ్బంది పడ్డారని, కనీస మద్దతు ధరలు అందలేదని, దీనివల్ల రాష్ట్రంలో 8,000 మందికి పైగా రైతు ఆత్మహత్యలు జరిగాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ సమస్యలను పరిష్కరించడంలో బీఆర్ఎస్ విఫలమైందని, ఆయన విమర్శించారు. ఇలా కాంగ్రెస్ నుండి ఎదురుదాడి రాగానే, వెంటనే కేటీఆర్ ట్వీట్ డిలీట్ చేయడం విశేషం.
Congress MP Kiran Kumar taunts KTR for deleting tweet on farmers’ woes under BRS rule https://t.co/2czhUkF5Gd
— Kiran Kumar Chamala (@kiran_chamala) February 11, 2025