AIIMS Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గుంటూరు, మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏఐఐఎంఎస్).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జూన్ 26 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 50
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు:
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రొఫెసర్
అసోసియేట్ ప్రొఫెసర్
అడిషనల్ ప్రొఫెసర్
వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్, మెడికల్ ఆంకాలజీ, మెడికల్ హెమటాలజీ, ఫొరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డీఎం, ఎంసీహెచ్, ఎండీ/ఎంఎస్, ఎమ్మెస్సీ పాస్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 16
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 26
వయోపరిమితి: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ణయించారు. ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ కు 58 ఏళ్ల వయస్సు ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు 50 ఏళ్ల వయస్సు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3100 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు రూ.2,100 ఫీజు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులు రూ.100 ఫీజు కట్టి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయినవారికి మంచి వేతనం ఉంటుంది. సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.
Also Read: NRSC Recruitment: ఏదైనా డిగ్రీ ఉంటే చాలు భయ్యా.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతం మాత్రం రూ.56,100
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 50
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 26