NRSC Recruitment: తెలంగాణ, ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ లేదా బీటెక్ లేదా ఎంటెక్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగం హైదరాబాద్ లో చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 31
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో సైంటిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఫారెస్ట్రీ&ఎకాలజీ, జియోఇన్ఫర్మాటిక్స్, జియాలజీ, జియోఫిక్స్, అర్బన్ స్టడీస్, వాటర్ రీసోర్స్ విభాగాల్లో వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
సైంటిస్ట్- ఇంజినీర్ పోస్టులు: 31
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, బీఆర్క్ పాసై ఉండాలి.
వయోపరిమితి: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 మే 30వ తేదీ నాటకి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 10
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 30
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.250 ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.750 ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు రూ.56,100 – రూ.1,77,500 జీతం ఉంటుంది. మరి ఇంకెందుక ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nrsc.gov.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. ఇలాంటి సద్వినియోగం చేసుకోండి.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 31
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 30