Fire Accident: రెండు రోజుల క్రితం హైదరాబాద్, చార్మినార్ ప్రాతంలో ఏసీ కంప్రెసర్ పేలడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిదే. అది మరవకముందే ఇవాళ హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఛత్రినాకలోని ఓ ఇంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్నవారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో చెప్పుల గోదాం నిర్వహస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: AIIMS Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసే అవకాశం.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..