NIACL Recruitment: డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. న్యూ ఇండియా అష్యూరన్స్ కంపెనీ లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి నెల చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
న్యూఇండియా అష్యూరన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐఏసీఎల్) లో 500 అప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 20న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ గడువులోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 500
న్యూ ఇండియా అష్యూరన్స్ కంపెనీ లిమిటెడ్ లో అప్రెంటీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జూన్ 6
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 20
వయోపరిమితి: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
స్టైఫండ్: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.9000 స్టైఫండ్ అందజేస్తారు. ఆ తర్వాత ఉద్యోగంలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.944 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.708 ఫీజు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు రూ.472 ఫీజు ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.newindia.co.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు స్టైఫండ్ కూడా ఉంటుంది.
ALSO READ: GRSE Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.90వేల జీతం, లాస్ట్ డేట్?
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 500
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 20