BigTV English

GRSE Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.90వేల జీతం, లాస్ట్ డేట్?

GRSE Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.90వేల జీతం, లాస్ట్ డేట్?

GRSE Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్‌లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి సాలరీ ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌(GRSE) కోల్‌కతా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 22 నుంచి జూన్‌ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 53


గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో సూపర్ వైజర్, డిజైన్ అసిస్టెంట్, ఇంజిన్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఉద్యోగాలు – వెకెన్సీలు: 

సూపర్‌ వైజర్‌(ఎస్‌ గ్రేడ్‌- 1, 2, 3, 4): 38 ఉద్యోగాలు
డిజైన్‌ అసిస్టెంట్(ఎస్‌ గ్రేడ్‌-1, 2): 17 ఉద్యోగాలు
ఇంజిన్‌ టెక్నీషియన్‌(ఎస్‌ గ్రేడ్‌-1): 01 ఉద్యోగం

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీబీఏ, బీఎస్సీ, డిప్లొమా, బీబీఎం, పీజీ డిప్లొమా పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సు ఉంటుంది. డిజైన్‌ అసిస్టెంట్‌కు 32 ఏళ్లు, సూపర్‌వైజర్‌కు 36 – 38 ఏళ్లు, ఇంజిన్‌ టెక్నీషియన్‌కు 28 ఏళ్లు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

వేతనం: సెలెక్ట్ అయిన వారికి భారీ శాలరీ ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. నెలకు సూపర్‌వైజర్‌ ఎస్‌-3గ్రేడ్‌కు రూ.27,600 – రూ.96,600, సూపర్‌వైజర్‌(ఎస్‌-2 గ్రేడ్‌)కు రూ.25,700 – రూ.90,000, సూపర్‌వైజర్‌(ఎస్‌-1గ్రేడ్‌)కు రూ.23,800 – రూ.83,300, సూపర్‌వైజర్‌(ఎస్‌-4గ్రేడ్‌)కు రూ.29,300 – రూ.1,02,600, ఇంజిన్‌ టెక్నీషియన్‌కు రూ.23,800 – రూ.83,300, డిజైన్‌ అసిస్టెంట్‌కు రూ.23,800 – రూ.83,300 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 12

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.472 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: http:grse.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: UPSC Notification: భారీ శుభవార్త.. యూపీఎస్సీలో 493 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఇంకా వారమే ఛాన్స్

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 53

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 12

Related News

DDA: డీడీఏ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. ఎక్స్‌లెంట్ జాబ్స్, ఇదే మంచి అవకాశం

Prasar Bharati Jobs: డిగ్రీతో ప్రసార భారతిలో ఉద్యోగాలు.. మంచి వేతనం, సింపుల్ ప్రాసెస్

APSRTC: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలు ఇదిగో..

BEL Recruitment: బెల్‌ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. మంచి వేతనం, ఈ అర్హత ఉంటే జాబ్..!

Police Constable: 7565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనం, ఇంటర్ పాసైతే చాలు

Group-II Notification: ఏపీ గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దుపై తీర్పు రిజర్వ్

BANK OF MAHARASHTRA: డిగ్రీ, బీటెక్ అర్హతలతో భారీగా కొలువులు.. ఈ జాబ్ వస్తే రూ.1,40,500 జీతం, డోంట్ మిస్

DSSSB: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. కాంపిటేషన్ తక్కువ, దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే..!

Big Stories

×