IPPB Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.
ఢిల్లీ, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్(IPPB) లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మార్చి 21న ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత ఉన్న అభ్యర్థులు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో మొత్తం 51 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ALSO READ: AAI Recruitment: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.40,000 జీతం.. మరి ఇంకెందుకు ఆలస్యం..
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 51
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: మార్చి 1
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: మార్చి 21 (అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 21 లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది)
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150 ఉంటుంది.)
విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 ఫిబ్రవరి 1 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://ippbonline.com/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: APSSDC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు.. జీతమైతే అక్షరాల రూ.3,30,000
ముఖ్యమైన సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 51
విద్యార్హత: ఏదైనా డిగ్రీ
వయస్సు: 35 ఏళ్లు మించరాదు.
జీతం: రూ.30000 ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 21