Akhil Agent OTT Streaming:ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ( Surender Reddy) దర్శకత్వంలో.. అక్కినేని అఖిల్ (Akkineni Akhil) హీరోగా నటించిన చిత్రం ఏజెంట్ (Agent) . మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో సాక్షి వైద్య (Sakshi Vaidya ) హీరోయిన్గా నటించిన చిత్రమిది.స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ సినిమా 2023 ఏప్రిల్ 28న విడుదలయ్యింది. ఇక 2023 మే 19వ తేదీన ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుందని అప్పుడు మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాలవల్ల ప్రకటించిన తేదీకి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి రాలేకపోయింది. ఇక అలా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ దాదాపు రెండేళ్లు గడిచిపోయాయి. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు. అయితే సడన్గా అభిమానులకు శుభవార్త చెబుతూ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.
Game Changer: ఓటీటీలో మరో ట్విస్ట్.. ఇదో సరికొత్త స్ట్రాటజీ..!
మార్చి 14 నుండీ సోనీ లివ్ లో..
తాజాగా ఓటీటీ సంస్థ సోనీ లివ్ ఏజెంట్ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. మార్చి 14 నుండి తమ ఫ్లాట్ ఫామ్ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతోందని తెలిపింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ప్రేక్షకులు వీక్షించవచ్చు అని కూడా తెలిపింది. మొత్తానికి అయితే రెండేళ్ల నిర్విరామ ఎదురుచూపు తర్వాత ఇప్పుడు ఈ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కి రాబోతోంది.
అఖిల్ ఏజెంట్ మూవీ స్టోరీ..
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రిక్కీ అలియాస్ రామకృష్ణ (అఖిల్) ఒక మధ్యతరగతి అబ్బాయి. స్పై కావడమే లక్ష్యంగా ‘రా’ లో చేరడానికి మూడుసార్లు పరీక్ష రాసినా విఫలమవుతాడు. దీంతో ఇలా ప్రయత్నం చేస్తే లాభం లేదని తన ఎథికల్ హ్యాకింగ్ నైపుణ్యాలతో ఏకంగా ‘రా’ చీఫ్ మహదేవ్ (మమ్ముట్టి) సిస్టంను హ్యాక్ చేసి అతడి దృష్టిలో పడే ప్రయత్నం చేస్తాడు. మరొకవైపు దేశాన్ని నాశనం చేయడానికి ధర్మ.. చైనాతో కలిసి ‘మిషన్ రాబిట్’ పేరుతో ఒక భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేస్తాడు. ఈ కుట్రను అడ్డుకునేందుకు మహాదేవ్ రిక్కీను రంగంలోకి దింపుతాడు. ఇక అంత పెద్ద మిషన్ కోసం మహదేవ్ ఎందుకు రిక్కీను రంగంలోకి దింపాడు. ఆయన ఆదేశాలను పక్కకు పెట్టి రిక్కీ కొని తెచ్చుకున్న ప్రమాదాలు ఏంటి? అసలు స్పై కావాలని రిక్కీ ఎందుకు అంత బలంగా కోరుకున్నాడు..? అనే అంశాలతో ఈ సినిమాను రూపొందించారు. ముఖ్యంగా యాక్షన్ స్పై చిత్రాలు కోరుకునే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుందని చెప్పాలి. ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు. అంతేకాదు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి తన బాడీలో చాలా వరకు మార్పు తెచ్చుకున్నారు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కి ఏమాత్రం గుర్తింపును అందివ్వలేదనే చెప్పాలి. మొత్తానికి అయితే ఎన్నో ఆశలు పెట్టుకొని రంగంలోకి దిగారు. కానీ అనుకున్నంత స్థాయిలో అఖిల్ కి ఈ సినిమా విజయాన్ని అందించలేదు. ఇక ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. కనీసం ఇక్కడైనా ఈ సినిమా మంచి గుర్తింపును అందుకొని.. విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.