BigTV English

APSSDC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు.. జీతమైతే అక్షరాల రూ.3,30,000

APSSDC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. వాళ్లే ట్రైనింగ్ ఇస్తారు.. జీతమైతే అక్షరాల రూ.3,30,000

APSSDC Job opportunity: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు, యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ (APSSDC) గుడ్ న్యూస్ చెప్పింది. మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా ఎనర్జీ సిస్టమ్స్ విభాగాల్లో శిక్షణ కల్పించి జర్మనీలోని పలు కంపెనీల్లో ఉద్యోగం ఇవ్వనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ ఈ అవకాశం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.


నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా ఎనర్జీ సిస్టమ్స్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పాసై అభ్యర్థులకు సువర్ణవకాశం. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టుకోవచ్చు. మార్చి 25 న దరఖాస్తు గడువు ముగియనుంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలను చూద్దాం.

ALSO READ: RRB Group-D correction: గుడ్ న్యూస్.. గ్రూప్-డీ జాబ్ అప్లికేషన్‌లో తప్పులు చేశారా..? అయితే ఇప్పుడే ఎడిట్ చేసుకోండి..


నిరుద్యోగ యువత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మంచి నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఎస్డీసీ, 2కామ్ సంస్థతో కలిసి ఈ శిక్షణ ఇవ్వనుంది. యువతకు జర్మనీ భాష నేర్పించి ఉద్యోగం అవకాశం కల్పించనున్నారు. విశాఖపట్నం, విజయవాడల్లో ఈ నైపుణ్య శిక్షణ నిర్వహించనున్నారు.

అర్హత:  మెకాట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా ఎనర్జీ సిస్టమ్స్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నవారికి జర్మన్ భాషలో శిక్షణ ఇవ్వబోతోంది.

వయస్సు: 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల డిగ్రీ లేదా డిప్లొమా హోల్డర్లు మరియు సంబంధిత రంగాలలో మూడేళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్న పురుషులు,  మహిళలు దరఖాస్తు పెట్టుకోవచ్చు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వర్చువల్ మోడ్ ద్వారా ఇంగ్లీష్ స్కిల్స్ టెస్ట్ చూసి సెలెక్ట్ చేస్తారు.

ఇందులో ఎంపికైన అభ్యర్థులు జర్మనీ భాషలో ట్రైనింగ్ ఇస్తారు. అభ్యర్థులు స్థాయిని బట్టి శిక్షణ ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఇవ్వనున్నారు. అభ్యర్థులు ఎంపిక చేసిన జర్మన్ కంపెనీలు వీసా, ఫ్లైట్ ఛార్జీలు, బీమా ప్రీమియంన భరిస్తాయి. అలాగే అభ్యర్థులకు రూ.40,000 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ తో పాటు రూ.30,000 డాక్యుమెంటేషన్ ఛార్జీలను కూడా భరిస్తుంది.

శిక్షణ కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ

కావాల్సిన సర్టిఫికెట్స్:

అభ్యర్థులు పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్, SSC సర్టిఫికేట్ లేదా మార్క్‌షీట్, డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్, వర్క్ ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ (లైట్ వెహికల్ లేదా హెవీ వెహికల్) తీసుకురావాలి.

ఒప్పందం: ఉద్యోగ ఒప్పందం వ్యవధి రెండు సంవత్సరాలు ఉంటుంది.

జీతం: 2800 నుండి 3600 యూరోలు ఉంటుంది

జర్మన్ భాషలో శిక్షణ  వీసా ప్రాసెసింగ్‌తో సహా ప్రాసెసింగ్ సమయం ఆరు నెలలు ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు APSSDC పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు

పోర్టల్: https://naipunyam.ap.gov.in/

అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. భారీ వేతనం కూడా కల్పించనున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: Court Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సొంత రాష్ట్రంలో జాబ్.. జీతం అక్షరాల రూ.77,840

ముఖ్యమైనవి:

దరఖాస్తుకు లాస్ట్ డేట్: మార్చి 25

జీతం: 2800 నుంచి 3600 యూరోలు (భారతదేశ కరెన్సీలో రూ.2,60,400 నుంచి రూ.3,34,800 ఉంటుంది)

Related News

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

Big Stories

×