Sai Dharam Tej: ఈరోజుల్లో యంగ్ హీరోలంతా తమ ప్రతీ సినిమాకు రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నారు. తమకు ఉన్న మార్కెట్ వాల్యూ ఎంత అని పట్టించుకోకుండా, ప్రతీ సినిమాకు బడ్జెట్‌ను పెంచేస్తున్నారు. నిర్మాతలు కూడా మార్కెట్ లేని యంగ్ హీరోలపై భారీ బడ్జెట్ పెట్టడానికి ఏ మాత్రం వెనకాడడం లేదు. ఇక కాస్త మార్కెట్ ఉండి, మినిమమ్ గ్యారెంటీ హీరో అయితే కళ్లు మూసుకొని రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టడానికి ఫిక్స్ అవుతున్నారు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విషయంలో కూడా అదే జరుగుతోంది. సాయి ధరమ్ తేజ్ అప్‌కమింగ్ మూవీ ‘సంబరాల ఏటి గట్టు’ కోసం మేకర్స్ భారీ ప్లానింగ్‌తో ఉన్నారు. పాట, ఫైట్లకు కోట్లలో ఖర్చుపెడుతున్నారు.
భారీ బడ్జెట్
సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) చివరిగా ‘విరూపాక్ష’ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా మాత్రమే కాదు.. అంతకు ముందు సాయి ధరమ్ తేజ్ నటించిన చాలావరకు సినిమాలు కూడా క్లీన్ హిట్స్‌గా నిలిచాయి. అందుకే మెగా హీరోల్లో తనను మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఫీలవుతారు ఫ్యాన్స్. మెగా ఫ్యామిలీలోనే చాలామంది యంగ్ హీరోలు ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తుంటే సాయి ధరమ్ తేజ్ మాత్రం మంచి మార్కెట్‌ను సంపాదించుకొని దూసుకుపోతున్నాడు. అందుకే తన తరువాతి సినిమా అయిన ‘సంబరాల ఏటి గట్టు’ కోసం మేకర్స్ భారీ బడ్జెట్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తుండగా దీనికి సంబంధించిన తాజా అప్డేట్ బయటికొచ్చింది.
వెయ్యి మంది
‘సంబరాల ఏటి గట్టు’లో ఒక పాటను, ఒక ఫైట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఒక సాంగ్ కోసం ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో 1000 మంది డ్యాన్సర్లతో సాంగ్ షూటింగ్ ప్రారంభమయ్యిందని సమాచారం. ఈ సాంగ్ షూటింగ్ కంటే ముందు ఒక ఫైట్‌ను కూడా పూర్తి చేశాడట సాయి ధరమ్ తేజ్. ఫైట్ మాస్టర్స్ రామ్, లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా ఉంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఫైట్ విషయం పక్కన పెడితే 1000 మంది డ్యాన్సర్లతో సాంగ్ షూటింగ్ అని వినగానే ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత గ్రాండ్‌గా తెరకెక్కుతున్న ఈ పాటను ఎప్పుడెప్పుడు తెరపై చూడొచ్చా అని ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: రాయలసీమ రౌడీ జనార్ధన్‌గా విజయ్.. ఫ్యాక్షన్ గొడవలకు రౌడీ హీరో సెట్ అవుతాడా.?
ఫస్ట్ లుక్ అదుర్స్
‘సంబరాల ఏటి గట్టు’ (Sambarala Yeti Gattu) సినిమాతో రోహిత్ టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఎన్నో కన్నడ, తెలుగు సినిమాలను మంచి మ్యూజికల్ హిట్స్‌గా అయ్యేలా చేసిన అజనీష్ లోక్‌నాథ్.. ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ‘సంబరాల ఏటి గట్టు’లో సాయి ధరమ్ తేజ్‌కు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో 18వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలయ్యింది.