BigTV English
Advertisement

Shahid Kapoor: సౌత్ దర్శకులనే నమ్ముకుంటున్న షాహిద్ కపూర్.. అప్పుడు సందీప్, ఇప్పుడు రోషన్..

Shahid Kapoor: సౌత్ దర్శకులనే నమ్ముకుంటున్న షాహిద్ కపూర్.. అప్పుడు సందీప్, ఇప్పుడు రోషన్..

Shahid Kapoor: ప్రస్తుతం బాలీవుడ్ దృష్టిలో సౌత్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. నార్త్ కంటే సౌత్‌లోనే కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయని, ప్రేక్షకులను మెప్పించేలా ఉంటున్నాయని, కలెక్షన్స్ సాధిస్తున్నాయని ప్రేక్షకులు సైతం చూస్తున్నారు. అంతే కాకుండా మేకర్స్ కూడా సౌత్ సినిమాలనే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలని ఫిక్స్ చేసుకున్నారు. గత కొన్నేళ్లలో ఎంతోమంది సౌత్ దర్శకులు సైతం బాలీవుడ్‌కు వెళ్లి హిట్లు కూడా కొడుతున్నారు. అలాగే కొందరు బీ టౌన్ హీరోలు సైతం మొత్తంగా సౌత్ దర్శకులపైనే భారం వేస్తున్నారు. ఆ లిస్ట్‌లో ఫస్ట్ పేరు షాహిద్ కపూర్. ఇప్పటికే ఒక సౌత్ దర్శకుడిని నమ్ముకొని తన కెరీర్‌లో అతిపెద్ద హిట్ అందుకున్న షాహిద్.. ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు.


మరో డైరెక్టర్

దాదాపు గత 20 ఏళ్లుగా ప్రేక్షకులను హీరోగా ఎంటర్‌టైన్ చేస్తున్నాడు షాహిద్ కపూర్. కానీ ఆ 20 ఏళ్లలో తను ఎప్పుడూ అందుకోలేనంత పెద్ద హిట్‌ను ‘కబీర్ సింగ్’తో అందుకున్నాడు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ని దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే అదే మూవీని ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో రీమేక్ చేశాడు. ఆ మూవీ తెలుగులో ఏ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. హిందీలో కూడా అదే రేంజ్‌లో హిట్ అయ్యింది. దీంతో షాహిద్ కపూర్ కూడా బాలీవుడ్ టైర్ 2 కేటగిరిలో చేరిపోయాడు. ఇప్పుడు మళ్లీ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. ఇంతకు ముందు ఒక తెలుగు దర్శకుడిని నమ్ముకున్న షాహిద్.. ఇప్పుడు ఒక మలయాళ డైరెక్టర్‌ను నమ్ముకున్నాడు.


Also Read: వింటేజ్ చిరంజీవిని చూపించను.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన శ్రీకాంత్ ఓదెల

ఫస్ట్ లుక్

గత కొన్నేళ్లుగా మలయాళంలో ఎన్నో ఇన్‌స్పిరేషనల్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు రోషన్ ఆండ్రూస్ (Rosshan Andrrews). ఇప్పటివరకు ఆయన మలయాళంలో తప్పా మరో భాషలో సినిమాను డైరెక్ట్ చేయలేదు. అలాంటిది మొదటిసారి సౌత్‌ను వదిలేసి నార్త్ బాటపట్టాడు. షాహిద్ కపూర్‌తో కలిసి ‘దేవ’ అనే మూవీని తెరకెక్కించాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు ఈ మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. ఇప్పటికైనా చెప్పిన తేదీకి ఈ సినిమా విడుదల అవుతుందా అని ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి.

రఫ్ లుక్

న్యూ ఇయర్ సందర్భంగా విడుదలయిన ‘దేవ’ (Deva) ఫస్ట్ లుక్‌లో షాహిద్ కపూర్ మాస్ ప్లస్ క్లాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. నోటిలో సిగరెట్‌తో చాలా రఫ్‌గా ఉన్నాడు. అంతే కాకుండా ఈ పోస్టర్‌లో తన వెనుక ఉన్న అమితాబ్ బచ్చన్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ‘దేవ’లో షాహిద్ కపూర్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. వీరితో పాటు ‘తప్పడ్’ ఫేమ్ పవైల్ గులాటి కూడా ఈ మూవీలో మరొక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ‘కబీర్ సింగ్’లాంటి మరొక హిట్.. షాహిద్ కపూర్ (Shahid Kapoor) ఖాతాలో పడనుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×