Allu Arjun: అల్లు అర్జున్ కేసు ఇప్పుడిప్పుడే క్లోజ్ అయ్యేలా లేదు. సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు నిందితుడిగా ఛార్జ్ షీట్ లో చేర్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే బన్నీని పోలీసులు రెండుసార్లు విచారించారు. అల్లు అర్జున్ పై ఇప్పటికే ఢిల్లీలో కూడా కేసు నమోదు అయ్యింది.
తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన విషయం బన్నీ తనకు తెలియదని ముందుచెప్పాడు. కానీ, పోలీసులు మాత్రం తాము ముందే చెప్పామని.. అయినా అల్లు అర్జున్ మాట వినలేదని చెప్పారు. ఇలా ఈ కేసులో పోలీసుల వెర్షన్ ఒకలా ఉంటే.. అల్లు అర్జున్ వెర్షన్ మరోలా ఉంది. విచారణలోకూడా అల్లు అర్జున్ కు ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇక తాజాగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది. అల్లు అర్జున్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి NHRC కమిషన్ నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది. సంధ్యా థియేటర్ దగ్గర లాఠీ ఛార్చ్ చేసిన పోలీసులపై మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీచేసింది. సంధ్య థియేటర్ దగ్గర లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసిన సందర్భంలో NHRC కమిషన్ ఈ ఆదేశాలను జారీ చేసింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్ కు ఆదేశాలు పంపించింది. దీంతో ఈ కేసు మరింత క్లిష్టతరంగా మారింది. మరి ఈ నోటీసులపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.