తాజాగా రాజస్థాన్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి జోధ్ పూర్ కు వెళ్తున్న ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగడంతో.. 20 మంది సజీవ దహనమయ్యారు. మరో 16 మంది గాయాలపాలయ్యారు. 57 మంది ప్రయాణికులతో జైసల్మేర్ నుంచి జోధ్ పూర్ కు బయల్దేరిన బస్సు.. సుమారు 10 నిమిషాల తర్వాత బస్సులో పొగలు వచ్చాయి. అప్పటికే డ్రైవర్ బస్సును పక్కకు ఆపాడు. అయినప్పటికీ క్షణాల్లో మంటలు బస్సు అంతా వ్యాపించాయి. చూస్తుండగానే బస్సులోని ప్రయాణీకులు శవాల ముద్దలుగా మారిపోయారు. 19 మంది బస్సులోనే ఆహుతి కాగా, మరొకరు హాస్పిటల్ కు తరలిస్తుండగా చనిపోయారు. ఈ ఘటనలో మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బస్సులో మంటలు చెలరేగడం అనేది క్షణాల్లో జరుగుతుంది. కానీ, కాస్త ప్రశాంతంగా ఉండాలి. త్వరగా రియాక్ట్ కావడం వల్ల ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగితే ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ముందుగా భయపడకుండా ఉండాలి. భయాందోళన అనేది ఎలా బయటపడాలో ఆలోచించే శక్తిని లేకుండా చేస్తుంది.
ఒకవేళ బస్సులో పొగ, మంటలు చూసినా, కాలుతున్నట్లు వాసన వచ్చినా, వెంటనే డ్రైవర్ ను అలర్ట్ చేయాలి.
ఒకవేళ బస్సులో మంటలు వస్తున్నట్లు గమనిస్తే వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు వెళ్లాలి. ఇతరులను నెట్టకుండా, పరిగెత్తకుండా తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మెయిన్ డోర్ క్లోజ్ అయితే, మరో ఎగ్జిట్ ను కనుగొనాలి.
రెడ్ కలర్ హ్యాండిల్స్ తో కూడిన ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను ఓపెన్ చేయాలి. అక్కడ ఉన్న సూచనలు పాటించి తెరవాలి. మీరు ఒక్కరే తెరవకపోతే, ఇతరుల సాయం తీసుకోవాలి.
పొగ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి. వంగి లేదంటే పాకుతూ వెళ్లండి. పొగ పీల్చకుండా ఉండేందుకు మీ ముక్కు, నోటికి గుడ్డను అడ్డంగా పెట్టుకోవాలి.
బ్యాగులు, వ్యక్తిగత వస్తువులను కోసం ప్రయత్నించకూడదు. ప్రాణాలు ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. మీరు సుక్షితంగా ఉంటే పిల్లలు, వృద్ధులు, మహిళలకు సాయం చేయండి.
బస్సులో మంటలు చెలరేగిన తర్వాత పేలుళ్లు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే, బస్సుకు దూరంగా ఉండాలి.
మీరు సురక్షితంగా బటయపడితే వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాలి. ప్రమాద స్థలం గురించి చెప్పాలి. ఈ సూచనలు పాటించడం వల్ల బస్సులో మంటలు చెలరేగినప్పుడు సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుంది.
Read Also: ఇది ప్రపంచంలోనే మోస్ట్ లాంగెస్ట్ ట్రైన్ జర్నీ, ఏకంగా 13 దేశాలను చుట్టేస్తుంది!