BigTV English

OTT Movie : భర్త లేనప్పుడు సంగీతం వాయించే మాస్టారుతో… కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకంటే ఇదేనేమో

OTT Movie : భర్త లేనప్పుడు సంగీతం వాయించే మాస్టారుతో… కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకంటే ఇదేనేమో
Advertisement

OTT Movie : ఓటీటీలో పాత సినిమాల దగ్గర నుంచి, కొత్త సినిమాల వరకు ఆడియన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. ఎలాంటి సినిమా అయినా ఒక్క క్లిక్ తో కళ్ల ముందు. వాలి పోతోంది. పాతికేళ్ళ క్రితం వచ్చిన ఒక మరాఠీ సినిమా, ఆసక్తికరమైన కథాంశంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ సినిమాలో టబు లీడ్ రోల్ లో నటించారు. ఇది ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. 2000 లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ మరాఠీ, బెస్ట్ డైరెక్టర్ (మహేష్ మంజ్రేకర్) గెలుచుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘అస్తిత్వ’ (Astitva) 2000లో వచ్చిన మరాఠీ సినిమా. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో టబు, సచిన్ ఖేడేకర్, మొహనిష్ బాహ్ల్, స్మితా జయకర్ నటించారు. ఈ సినిమా 2000 అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. IMDbలో 7.3/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

అదితి ముంబైలో మ్యూజిక్ టీచర్‌గా పని చేస్తుంటుంది. ఆమె భర్త శ్రీకాంత్ ప్రొఫెసర్ పని చేస్తుంటాడు. వాళ్లకు అనికేత్ అనే 25 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ల పెళ్లి జరిగి దాదాపు 27 సంవత్సరాలు అవుతుంటుంది. అదితి తన కుటుంబాన్ని బాగా చూసుకుంటూ ఉంటుంది. కానీ ఆమె గతంలో మల్హార్ అనే వ్యక్తితో ప్రేమలో ఉండేది. మల్హార్ చనిపోయిన తర్వాత శ్రీకాంత్ అదితిని పెళ్లి చేసుకుని ఉంటాడు. కానీ అదితి ఈ సీక్రెట్ గురించి ఎవరికీ చెప్పదు. ఇప్పుడు అదితి కొడుకు అనికేత్ తన ప్రియురాలు రేవతితో పెళ్లి ప్లాన్ చేస్తాడు. అనికేత్, రేవతి పెళ్లి ప్లాన్స్ జరుగుతున్నప్పుడు, శ్రీకాంత్‌కు అదితి గతం గురించి తెలుస్తుంది.


Read Also : డివోర్స్‌డ్ సేల్స్ మ్యాన్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్… జైల్లో భార్య ప్రియుడితో… క్లైమాక్స్ హైలెట్

మల్హార్ చనిపోయిన తర్వాత అతని రచనలు అమ్ముడై, ఆ డబ్బు అదితికి వచ్చినట్లు శ్రీకాంత్‌కు తెలుసుకంటాడు. అదితికి, మల్హార్‌కు సంబంధం ఉందని శ్రీకాంత్ కి అర్థమైపోతుంది. దీంతో అతను అదితితో గొడవ పడి, ఆమెను దూరం పెడతాడు. అదితి తన గతం దాచుకుని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ శ్రీకాంత్ ఆమెను అర్థం చేసుకోడు. మల్హార్‌ తో ఉన్నప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. అనికేత్ వాస్తవంగా మల్హార్ కొడుకని భర్తతో చెప్పేస్తుంది. శ్రీకాంత్ ఈ విషయం విని షాక్ అవుతాడు. ఇక ఈ కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. దీంతో అదితితో శ్రీకాంత్ విడిపోతాడా ? కలసి కాపురం చేస్తాడా ? అనే విషయాలను, ఈ మరాఠీ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

Santosh OTT release date : మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ‘సంతోష్’… థియేటర్లలో రిలీజ్ కాకుండా చేసిన వివాదం ఏంటో తెలుసా ?

Greater Kalesh On Netflix : టెండింగ్ లో ‘గ్రేటర్ కలేష్’… దీపావళి కానుకగా రిలీజ్ కాబోతున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా

Delhi Crime season 3 on OTT : రెండేళ్ల బాలికపై అఘాయిత్యం… కొత్త కేసుతో మోస్ట్ వాంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ కు రెడీ

Jio hotstar : హాట్‌స్టార్ లో ట్రెండ్ అవుతున్న టాప్‌-5… దుమ్మురేపుతున్న బిగ్ బాస్, మరో తెలుగు సినిమా

Vijay Antony: ఓటీటీలోకి విజయ్ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : డివోర్స్‌డ్ సేల్స్ మ్యాన్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్… జైల్లో భార్య ప్రియుడితో… క్లైమాక్స్ హైలెట్

OTT Movie : మార్చురీలో వరుస మర్డర్స్… 30 ఏళ్ల తరువాత మళ్ళీ మొదలుపెట్టే సీరియల్ కిల్లర్… నరాలు కట్టయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×